ఆయన మా జీవన మార్గదర్శకుడు, స్నేహితుడు, గురువు అన్నీ
మా నాన్న గారు ఎప్పుడూ మా పర్శనల్ మ్యాటర్స్ లోకి ఇంటర్ఫియర్ కాలేదు.ఆయనకు చాలా స్ఫష్టంగా ఎక్కడ గీత గీయాలో తెలుసు. ఆయన మా కుటుంబానికి ఎప్పుడూ ఉంటారు.మేమంతా ఒకే ఇంట్లో ఉంటూ ఎప్పుడూ మాట్లాడుకుంటూంటాము.అలాగే ఆయన మాకు మార్గదర్శకుడు.ఎప్పుడూ ఆయన్ని కన్సల్ట్ చేయందే ఏ పనీ ప్రారంభించం. నేనే కాదు మా సోదరులం అందరమూ అంతే. ఆయనకు విషయం చెప్పగానే ఆయన బిజెనెస్ ఐడియాలు చెప్తారు, మా నాన్నగారు చాలా అధ్బుతమైన బిజెనెస్ మ్యాన్.
ఆయన ఆలోచనలు పరిగణనలోకి తీసుకోకపోవటం అంత తెలివితక్కువ తనం మరొకటి ఉండదు. ఆయనెప్పుడూ మా గురించే ఆలోచిస్తూ బెస్ట్ ఆలోచనలునలు మాకు ఇస్తూంటారు. ఆయన మా ప్రెండ్,ఫిలాసఫర్, మార్గదర్శి..ఇంకా ఎన్నో అంటూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ గురించి. రీసెంట్ గానే గీతా ఆర్డ్స్ బ్యానర్ పై అల్లుఅర్జున్ హీరోగా బద్రీనాధ్ చిత్రం విడుదలైంది.


Click it and Unblock the Notifications











