నిజమే, హీరో అల్లు అర్జున్ కూడా డ్రగ్స్...!
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో యువతలో డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నట్లు వార్తల్లో వింటూనే ఉన్నాం. ఆ మధ్య పలువురు సినీ తారలు కూడా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారు. అదే సమయంలో ఇలాంటి దురలవాట్లకు వ్యతిరేకంగా పలువురు స్టార్స్ ఫ్రచారం కూడా చేస్తున్నారు.
ఇలా డ్రగ్స్(మాదక ద్రవ్యాలు)లకు వ్యతిరేకంగా ప్రచారం చేసే హీరోల లిస్టులో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరి పోయారు. అమృత స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాంటీ డ్రగ్ కాంపెయిన్‌కు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. ‘రీచ్ ఫర్ ది స్టార్స్ నాట్ డ్రగ్స్' అంటూ ఆయన కార్యాలయం నుండి ఒక సందేశం వెలువడింది.

సర్వేల ప్రాకారం ఇండియాలో దాదాపు 7.5 కోట్ల మంది డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారట. ఇందులో 30 శాతం మంది 12 నుండి 18 సంవత్సరాల వయస్సున్న వారే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాలు ప్రరంభమయ్యాయి. అందులో భాగంగా అమృత స్కూల్ ఆఫ్ కమ్యూనికేష్ సంస్థ కూడా ఒకటి.
తాను అడగ్గానే తమ డ్రగ్స్ వ్యతిరేక కాంపెయిన్‌లో భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆ సంస్థ ప్రతినిధి అశ్వథి కృష్ణ.


Click it and Unblock the Notifications