twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది

    By Srikanya
    |

    అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా పోయిన ఇలియానా ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వనుంది.దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.గతంలో త్రివిక్రమ్ జల్సా చిత్రానికి సంగీతం అందించారు. అలాగే అల్లు అర్జున్ గత చిత్రాలకు దేవి సంగీతం బాగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీనికోసం ఇటీవల ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్‌లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది. కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్‌లో డెరైక్ట్‌గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్‌లో పెట్టారు. అలాగే రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని చెప్తున్నారు.

    English summary
    From November 2nd, Allu Arjun and Trivikram film movie will commence its regular shoot in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X