అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రం ఖరారు...డిటేల్స్
హైదరాబాద్: ప్రస్తుతం రేసు గుర్రం చిత్రం చేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం ఖరారు చేసుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు అల్లు అర్జున్ అంగీకరించారు. పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ కథను ఇందుకు సిద్ధం చేసినట్లు తెలిసింది. అర్జున్ ప్రస్తుతం 'రేసుగుర్రం' చిత్రంచేస్తున్నారు. ఆ తరవాత హరీష్ చిత్రం ఉంటుంది.
పవన్ హీరోగా వచ్చిన 'గబ్బర్‌సింగ్'తో హరీష్ కలం సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతంఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న 'రామయ్యా వస్తావయ్యా'లో కూడా తన పంచ్ పవరేంటో చూపిస్తున్నారు హరీష్. ఇటీవల విడుదలైన ఆ సినిమా ప్రోమోలే అందుకు నిదర్శనం.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ని డెరైక్ట్ చేయనున్నారు హరీష్‌శంకర్. ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హరీష్‌శంకర్ తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానులను ఆయన మరోసారి అలరించడం ఖాయమని ఇప్పటికే ఫిలింనగర్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాను ఎవరు నిర్మించేది, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం హరీష్ ఓ ఆసక్తికరమైన టైటిల్‌ని రిజిస్టర్ చేయించారు.


Click it and Unblock the Notifications












