»   »  షాకిస్తున్న అల్లు అర్జున్ లీక్ పొటో....ఇలా ఉన్నాడేంటి?

షాకిస్తున్న అల్లు అర్జున్ లీక్ పొటో....ఇలా ఉన్నాడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టైల్ కు ఐకాన్ గా ఉంటాడు అల్లు అర్జున్ . ఆయన స్టైల్స్ చాలా సార్లు అదిరిపోతూంటాయి. అందుకే స్టైలిష్ స్టార్ అని పిలుచుకునే బన్ని రీసెంట్ లీక్ పొటో ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది.

రీసెంట్ గా 'స రైనోడు'గా అలరించిన అల్లు అర్జున్‌ ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథమ్‌' అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. ఈ చిత్రానికి 'డిజె' అనే పేరు ఖరారు చేసి షూటింగ్ మొదలెట్టారు. డిజె అంటే 'దువ్వాడ జగన్నాథమ్‌' అన్నమాట.

ఇక ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ కు వెరైటి హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసారని తెలుస్తోంది. ఈ మేరకు కొత్త హెయిర్ స్టైల్ తో కూడిన ఓ ఫొటో ఇప్పుడు వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అంత షాకింగ్ గా ఉందా ఫొటో. మీరు ఇక్కడ ఆ పొటోని చూడవచ్చు.

Allu Arjun's New Look for DJ..Duvvada Jagannadam

సరైనోడు సినిమా దాదాపు 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మొత్తం మీద 70కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 22న రిలీజ్ చేసారు. అందుకే బన్నీ ఇప్పుడు హరీష్ శంకర్ తో చేస్తున్నడిజె సినిమాను కూడా వచ్చేసంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

డిజె దువ్వాడ జగన్నాథంగా అల్లు అర్జున్ చేయబోయే రచ్చ ఎలా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ కలుగుతోంది అందరిలోనూ. గత మూడేళ్లనుంచి ఏప్రిల్ లో వచ్చి బీభత్సమైన హిట్స్ కొడుతున్నబన్నీకి వచ్చే ఏప్రిల్ డిజె కు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.

Allu Arjun's New Look for DJ..Duvvada Jagannadam

ఇక హీరోయిన్ విషయానికి వస్తే..'ము కుంద', 'ఒక లైలా కోసం' చిత్రాల్లో మెరిసింది పూజా హెగ్డే. ఆ తరవాత కనిపించలేదు. హృతిక్‌ రోషన్‌ నటించిన 'మొహంజొ దారో' కోసం తెలుగు సినిమాలేం ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. తాజాగా అల్లు అర్జున్‌ చిత్రంలో అవకాశం అందినట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది.

హరీష్‌శంకర్ మాట్లాడుతూ దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా ఇదన్నారు. దిల్‌రాజుగారితో తన అనుబంధం గబ్బర్‌సింగ్‌ నుంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆర్య సినిమా వచ్చినప్పటి నుంచి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నా..ఇప్పటికి ఆ కోరిక తీరిందని వెల్లడించారు. ఈ చిత్రానికి కూర్పు: గౌతం రాజు, కళ: ఎస్‌.రవీందర్‌, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Allu Arjun's latest movie is DJ..Duvvada jagannadham. As fans expected Allu arjun came up with a new look for the movie DJ.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu