Don't Miss!
- Sports
Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..
- News
IT Hub: అక్కాచెల్లి మీద దాడి కేసులో ముగ్గురి అరెస్టు, దెబ్బకు తేరుకున్న పోలీసులు !
- Automobiles
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Pushpa మూవీ ఖాతాలో మరో ఘనత: కానీ బాలకృష్ణ రికార్డుకు చాలా దూరంలోనే అల్లు అర్జున్
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ చిత్రాలు రూపొందుతున్నాయి. దీనికి కారణం మన సినిమా పవర్ ప్రపంచానికి పరిచయం అవడమే. దీన్ని ఉపయోగించుకునే మన హీరోలందరూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే పలువురు స్టార్లు బహు భాషా చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఇటీవలే 'పుష్ప' అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఈ మూవీతో తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ ఓ అరుదైన ఘనతను అందుకుంది. కానీ, బాలయ్య రికార్డును మాత్రం బన్నీ దాటలేకపోయాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

పుష్పగా అల్లు అర్జున్ విశ్వరూపం
'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.
బట్టలున్నా లేనట్లే మలైకా అరోరా అరాచకం: 48 ఏళ్ల వయసులో శృతి మించి మరీ దారుణంగా!

అన్ని భాషల్లో హిట్.. హిందిలోనే
గంథపు చెక్కల నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చింది. ఇలా దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి భారీ విజయం దక్కింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్లతో సత్తా చాటింది.

పుష్ప మూవీ కలెక్షన్లు... లాభాలు
పాన్ ఇండియా రేంజ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్ల లాభాలు కూడా దక్కాయి.
ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

ఓటీటీలోనూ సత్తా.. ట్రెండింగ్‌లో
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అందులోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ మూవీ చాలా రోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక, అన్ని భాషల్లోనూ ఓటీటీలోకి వచ్చేసినా థియేటర్లలో కూడా స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు ఎంతో కొంత వస్తూనే వచ్చాయి.

యాభై రోజులు పూర్తి చేసుకుంది
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని తగ్గేదేలే అనే డైలాగ్‌తో పాటు శ్రీవల్లి స్టెప్ మరింత ఫేమస్ అయ్యాయి. దీంతో చాలా మంది సెలెబ్రిటీలు సైతం వీటితో వీడియోలు చేశారు. ఈ మూవీ తాజాగా యాభై రోజులు పూర్తి చేసుకుని మరో ఘనత అందుకుంది.
సిరి హన్మంత్‌కు శ్రీహాన్ బ్రేకప్: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో!

బాలయ్యను చాలా దూరంలోనే
పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన 'పుష్ప' మూవీ 24 సెంటర్లలో యాభై రోజుల పాటు ప్రదర్శితం అయింది. దీంతో ఓటీటీలో వచ్చినా పర్వాలేదనిపించింది. మరోవైపు, ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ' మూవీ ఏకంగా 105 సెంటర్లలో ఈ ఫీట్ సాధించింది. ఈ లెక్కన చూసుకుంటే అల్లు అర్జున్ మూవీ దీనికి చాలా దూరంలోనే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు.