Pushpa Fight Video: అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫైట్ వీడియో లీక్.. కేసు పెట్టిన కాసేపటికే ఇంకోటి బయటకు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన కీలక విషయాలు, వీడియోలు, పాటలు ఇలా ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇవి ఇంకాస్త ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఇటీవల పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న 'పుష్ప' మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు వచ్చేశాయి. దీంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. అంతేకాదు, మరోసారి ఇలా జరిగితే ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది జరిగిన కాసేపటికే 'పుష్ప' మూవీ నుంచి మరో వీడియో లీకైంది. ఇందులో ఏకంగా అల్లు అర్జున్ ఫైటింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 ‘పుష్ప రాజ్‌'గా రాబోతున్న అల్లు అర్జున్

‘పుష్ప రాజ్‌'గా రాబోతున్న అల్లు అర్జున్

'అల.. వైకుంఠపురములో' వంటి పరిశ్రమ విజయం తర్వాత అల్లు అర్జున్.. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లెక్కల మాస్టారు సుకుమార్ కలిసి చేస్తున్న చిత్రమే 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

బాహుబలి బాటలో... ఫస్ట్ పార్ట్ అప్పుడే

బాహుబలి బాటలో... ఫస్ట్ పార్ట్ అప్పుడే

ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీజర్‌కు అలా... పాటకు ఇలా.. అదుర్స్

టీజర్‌కు అలా... పాటకు ఇలా.. అదుర్స్

అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇక, ఇటీవలే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఐదో భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సౌత్‌లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన పాటగా ఇది రికార్డులకెక్కింది. అలాగే, లైకులు కూడా భారీగానే సంపాదించుకుందీ సాంగ్.

 పుష్ప నుంచి లీకులు.. ఫ్యాన్స్‌ నిరాశగా

పుష్ప నుంచి లీకులు.. ఫ్యాన్స్‌ నిరాశగా

'పుష్ప' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్న అతడు.. రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు ప్రాంతపు యాసను మాట్లాడుతున్నాడు. ఇలా తనను తానే సానబట్టుకుంటున్నాడు. ఇంత కష్టపడి ఈ సినిమా చేస్తుంటే.. దీని నుంచి ఫొటోలు, పాటలు, వీడియోలు ఇలా ఎన్నో రకాల విషయాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. యూనిట్‌కు జాగ్రత్తలు చెప్తున్నారు.

నిర్మాణ సంస్థ ఫిర్యాదు.. వార్నింగ్ కూడా

'పుష్ప' మూవీ నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లీక్ అవుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'మా సినిమాలకు .సంబంధించిన మెటీరియల్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వల్ల మేము బాగా నిరాశ చెందాము. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ విషయాలకు సంబంధించి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌లో ఫిర్యాదు కూడా చేశాం. ఎవరైతే ఈ పనులు చేశారో.. వాళ్లు కచ్చితంగా భారతదేశ చట్టాల ప్రకారం నిందితులు అవుతారు' అంటూ ఆ ప్రకటనలో పేర్కొంటూ హెచ్చరించింది.

అల్లు అర్జున్ ‘పుష్ప' ఫైట్ వీడియో లీక్

'పుష్ప' మూవీ లీకులపై చిత్ర యూనిట్ హెచ్చరించిన కాసేపటికే దీని నుంచి మరో వీడియో బయటకు వచ్చింది. ఇది ఆ సినిమాలోని ఎంతో ముఖ్యమైన ఫైటింగ్ సీన్ కావడం గమనార్హం. ఇందులో అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్‌‌తో ఫైట్ చేయడం కనిపించింది. భుజంపై కుర్చీని పట్టుకుని లుంగీ కట్టుకోవడం ఈ సినిమాలోని మాస్ కోణాన్ని సాక్షత్కరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు రిపోర్టులు కొడుతుండగా.. చాలా మంది మాత్రం భారీ స్థాయిలో షేర్లు చేస్తున్నారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
 ఏకంగా అక్కడి నుంచే వీడియో బయటకు

ఏకంగా అక్కడి నుంచే వీడియో బయటకు

తాజాగా 'పుష్ప' మూవీ నుంచి బయటకు వచ్చిన వీడియోను పరిశీలిస్తే.. అది ఎడిటింగ్ రూమ్‌లో నుంచి లీక్ అయినట్లు అర్థం అవుతోంది. ఈ సీన్‌కు రీరికార్డింగ్ కూడా పూర్తైపోయింది. దీంతో అల్లు అర్జున్ ఫైట్ చేస్తుండగా రీసౌండ్లు వస్తున్నాయి. ఇలా మూవీ యూనిట్ నుంచి లీకులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ముందు ఇంటి దొంగలనే పట్టుకోవాలని నిర్మాతలకు అల్లు అర్జున్ అభిమానులు సలహాలు ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయిపోయింది. ఇదిలా ఉండగా, మొన్న ఫస్ట్ సింగిల్ వీడియోను గణేష్ ఆచార్య మాస్టర్ ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X