నార్వేకు వెళ్తున్న అల్లు అర్జున్
ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్రం వచ్చే నెలలో నార్వేకు ప్రయాణం పెట్టుకున్నారు. అక్కడే సినిమాలో మేజర్ పార్ట్ తీయనున్నారని సమాచారం. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్, పాటలు అక్కడే తీస్తారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
ఈ చిత్రానికి రేసు గుర్రం అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ నటించనుంది. వీరిద్దరూ తొలిసారి కలసి నటించటంతో ట్రేడ్ లో మంచి క్రేజ్ రానుంది. క్రితం సంవత్సరం అక్టోబర్ లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది.
నల్లుమలుపు బుజ్జి, కె వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు అల్లు అర్జున్...ఎవడు చిత్రంలోనూ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












