‘S/O సత్యమూర్తి' ఆడియో...ఇక్కడ చూడండి
హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కలయికలో ‘జులాయి' లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం.. ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదలను నేటి (మార్చి 15) రాత్రి హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను మీరు ఈ క్రింద వీడియో లో చూడవచ్చు.
ఈ వేడుకకు సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యేలా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సినిమాలో నటించిన హీరోయిన్లు సమంత, అదా శర్మ, నిత్యామీనన్‌లు ఈ వేడుకకు హాజరవుతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ రేంజిలో రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ‘విలేవలే ఆస్తి' అనేది కాప్షన్ తో వస్తోంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జులాయి సినిమా తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి మూవీపై ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా సినిమా టీజర్ విడుదల కావడంతో.. విడుదల తేదీకి కౌంట్‌డౌన్ మొదలైనట్టే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు ‘మా టీవీ' ఛానల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఛానల్ వారు ఏకంగా రూ. 9.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద రేటు ఇచ్చి తీసికున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతకు లాభాలు వచ్చేశాయని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్‌తో పాటు త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతోనే బయ్యర్లు ఈ రేంజ్‌లో సినిమాను కొనుగోలు చేశారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రం తరువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం తరువాత చేస్తున్నందున ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అన్నారు.
ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











