బన్నీ బాగున్నాడు: ‘S/O సత్యమూర్తి' కొత్త ఫొటోలు
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘S/O సత్యమూర్తి' . ఈ చిత్రం అఫీషియల్ టైటిల్ లోగో ని,టీజర్ ని ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓ రేంజిలో రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ‘విలేవలే ఆస్తి' అనేది కాప్షన్ తో వస్తోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఈ చిత్రంకి సంభందించిన కొత్త ఫొటోలు రిలీజ్ చేసారు. ఇవి అభిమానులను బాగా అలరిస్తున్నాయి. ఈ చిత్రం లో అల్లు అర్జున్ ..వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తారు. దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెంటనే చూసే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
జులాయి సినిమా తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి మూవీపై ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా సినిమా టీజర్ విడుదల కావడంతో.. విడుదల తేదీకి కౌంట్‌డౌన్ మొదలైనట్టే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఆ ఫొటోలు మీ కోసం...

శాటిలైట్ రైట్స్
ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు ‘మా టీవీ' ఛానల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఛానల్ వారు ఏకంగా రూ. 9.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద రేటు ఇచ్చి తీసికున్నట్లు తెలుస్తోంది.

థియోటర్ రైట్స్ సైతం.
ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ధియేట్రికల్ రైట్స్‌ను ఇప్పటికే అమ్మేశారట నిర్మాతలు. హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్- త్రివిక్రమ్.. లేటెస్ట్ మూవీ రైట్స్‌ను యాభై నాలుగున్నర కోట్లకు అమ్మేశారట నిర్మాతలు.

రిలీజ్ కు ముందే లాభాలు
దీంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతకు లాభాలు వచ్చేశాయని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్‌తో పాటు త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతోనే బయ్యర్లు ఈ రేంజ్‌లో సినిమాను కొనుగోలు చేశారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

ఎంత రావాలంటే...
సన్నాఫ్ సత్యమూర్తి మూవీని.. రేసుగుర్రం మొత్తం కలెక్షన్ల రేటుకు అమ్మేశారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాలంటే కనీసం 60 కోట్లు వసూళ్లు చేయాలి.

నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ...
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రం తరువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం తరువాత చేస్తున్నందున ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఎవరెవరు...
ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

హైలెట్...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే
ఈ చిత్రం పోస్టర్స్, ఫస్ట్ లుక్ తో ఓ స్దాయిలో క్రేజ్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఆడియో విడుదలైతే ఇక ఎలాంటి క్రేజ్ ఉండబోతోందో అంటున్నారు.


Click it and Unblock the Notifications











