బన్నీ 'సరైనోడు' ప్రీలుక్ పోస్టర్ ఇదిగో

By Srikanya

హైదరాబాద్‌: అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 26న ఫస్ట్ లుక్ వదలటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ..ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. ఆ పోసట్ర్ ఇప్పుడు అభిమానులను విపరీతంగ ఆకట్టుకుంటోంది. మీరు ఓ ప్రీలుక్ పై ఓ లుక్కేయండి మరి.

అల్లు అర్జున్ తో తమన్ చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇంతకుముందు రేసుగుర్రం చిత్రానికి ఇద్దరూ పనిచేసారు. అలాగే ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016 న విడుదల చేయటానికి తేదీ ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికి... కార్యరూపం దాల్చటానికి టైమ్ పట్టింది.. తొలిసారి బన్నీ, బోయపాటి కాంబినేషన్ ఫ్యాన్స్ కి కిక్కివ్వబోతోంది... ఫస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో వస్తున్నఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.... ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైమ్ జతకట్టింది... గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Allu Arjun's Sarainodu pre look Poster

బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

అలాగే ఈ చిత్రంలో చబ్బీ బ్యూటీ అంజలి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సరైనోడు చిత్రంలో ఆమె నటించనుందని సమాచారం. ఈ సినిమాలో ఆమెది ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ కాకపోయినా ఆమె స్పెషల్ అప్పీరియన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే పాత్ర అని చెప్తున్నారు. ఓ సీన్, స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X