షాకింగ్: అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ ఎఫెక్ట్ లక్షల మందిపై..!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సోషల్ రెస్పాన్సబులిటీగా ఉంటారనే పేరు ఉంది. తాజాగా అల్లు అర్జున్ కూడా ఆయన దారిలోనే ప్రయాణిస్తున్నాడు. అల్లు అర్జున్ స్వయంగా నటించిన నిర్మించి 'ఐ యామ్ దట్ ఛేంజ్' షార్ట్ ఫిల్మ్ ఆగస్టు 15న సందర్భంగా విడుదలైంది.
ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వారంతా ఈ షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించడం కూడా దేభభక్తే అంటూ....సాగిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రజలకు తమ తమ సోషల్ రెస్పాన్సబులిటీని గుర్తు చేసేలా ఉందని, ఈ షార్ట్ ఫిల్మ్ ఆలోచన ఎంతో అద్భుతమని అంటున్నారు.
యూట్యూబులో ఇప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్‌ను 13 లక్షల మందికిపైగా వీక్షించారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఎఫెక్ట్ లక్షల మందిపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం, పరీక్షల్లో కాపీ కొట్టడం, చెత్తను రోడ్డుపై పడేయడం, సెలబ్రిటీలకు అసాధారణ సౌకర్యాలు కల్పించడం... ప్రస్తుతం సమాజంలో మామూలైపోయిన నిర్లక్ష్య ధోరణులివి. వీటిని నిలువరించడం అంటే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడమే. ఇదీ దేశసేవ కిందకే వస్తుందంటున్నారు అల్లు అర్జున్. ఈ షార్ట్ ఫిల్మ్ కు సుకుమార్ దర్శకత్వం వహించారు.
ఈ షార్ట్ ఫిల్మ్ పై వ్యూవర్స్ చేసిన కామెంట్స్ స్లైడ్ షోలో....

జిగన్మత్ నర్బూ
ఈ షార్ట్ ఫిల్మ్ ఒక మంచి మెసేజ్. ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యత ఎరిగి నడుచుకోవడం ఈ వీడియో చూసి నేర్చుకోవాలి.

సనీస్ సుందరమ్
మహాత్మా గాంధీ చెప్పిన మంచి మాటల ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీసారు. చాలా బాగుంది.

సంతోష్ రాపర్తి
మంచి షార్ట్ ఫిల్మ్. మంచి, చెడు ఆలోచనలకు అద్దం పట్టేలా ఉంది.

మజార్ అలీ
గ్రేట్ షార్ట్ ఫిల్మ్. త్వరలో అందరూ దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

సుమిత్
ఈ షార్ట్ ఫిల్మ్ ప్రతి ఒక్కరిలో మంచి మార్పుకు నాంది పలికే విధంగా ఉంది.

సత్య ఆనంద్
మనుషుల్లో మార్పు వస్తే, సమాజంలో మార్పు వస్తుంది. షార్ట్ ఫిల్మ్ బాగుంది.

ప్రవీణ చుంద్రు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది.

దత్తా బోంస్లే
ఐ యామ్ ది చేంజ్. వెరీ గుడ్ వీడియో. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా మందిలో మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను.

మీనాక్షి భరద్వాజ్
ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. కేవలం చూడటం కాదు...అంతా దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను.

యోగేష్ చౌదరి
ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వారిలో తప్పకుండా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.


Click it and Unblock the Notifications











