అల్లు అర్జున్ కొడుకు డాన్స్ ప్రాక్టీస్... (ఫోటో)
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఇటీవలే తొలిపుట్టినరోజు జరుపుకున్నాడు. తండ్రి టాలీవుడ్లో పెద్ద స్టార్ కావడంతో అయాన్ పుట్టిన వెంటనే సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. వివిధ అకేషన్లలో అల్లు అర్జున్ తన కొడుకు తో ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలు విడుదల చేయడంతో అయాన్ కూడా అభిమానుల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా అయాన్ కు సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను పోస్టు చేసింది మరెవరో కాదు...అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో అయాన్ అద్దం ముందు నిల్చొని డాన్స్ చేస్తున్నాడు. వెంటనే స్నేహారెడ్డి ఈ ఫోటో క్లిక్ మనిపించారు.
అయాన్ ఊపు చూస్తుంటే భవిష్యత్తులో తండ్రిని మించిన డాన్సర్ అవుతాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











