twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లి విందు!

    By Sindhu
    |

    అల్లు అర్జున్ కెరీర్ ఆరంభమైన తర్వాత అతను చేస్తోన్న పాత్రలు చాలా ఢిఫరెంట్ గా ఉంటాయి. ఏ సినిమాకా సినిమా అల్లు అర్జున్ ని ఢిఫరెంట్ గా ఆవిష్కరిస్తున్నాయి. దీనికి కారణం కథలు ఎన్నుకునేటప్పుడు అర్జున్ చాలా జాగ్రత్తలు వహిస్తాడట. మినిమమ్ గ్యారంటీ అనిపించే కథలు ఎన్నుకుంటానని, నిర్మాతకు లాభాలు వచ్చే విధంగా కథ ఉందో లేదో చూసుకుంటానని అర్జున్ అంటున్నాడు. ఎక్స్ పిరిమెంట్స్ చేసి నిర్మాతల డబ్బుతో ఆడుకోవటం నాకిష్టముండదు అని కూడా స్టైలిష్ స్టార్ చెబుతున్నాడు.

    ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఆర్య 2" విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఒక్కడు, చూడాలని వుంది వంటి చిత్రాలతో భారీ చిత్రాల దర్శకుడుగా పేరు పొందిన గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఎలాగో అనుకుంటున్నారా! 'వరుడు' అనే చిత్రం ద్వారా. నత్తనడక నడుస్తోన్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకుని వేసవిని అలరించడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం పై పలు అంచనాలు నెలకొన్నాయి.

    ఎంతో వైవిధ్యభరితంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సుహాసిని, అల్లు అర్జున్ తల్లిగా నటించబోతుంది. అంతేకాదు, ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరును, తన కంటూ ఒక స్టైల్ ను నిలబెట్టుకున్న సంగీతం శ్రీనివాసరావు ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను చేయనున్నారు. మార్చి చివరి వారంలో విడుదల అవనున్న ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, నిజ జీవితంలో నివసిస్తున్న వారి జీవితాలనే ఇతి వృత్తంగా ఈ సినిమాలో చూపించనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X