అల్లు ఫ్యామిలీకి షాక్.. కుటుంబంలో విషాదం.. మామ మరణంతో హుటాహుటిన ప్రయాణం

అల.. వైకుంఠపురములో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యామిలీని ఓ పిడుగులాంటి వార్త విషాదంలో ముంచెత్తింది. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన మంచి జోష్‌లో ఉన్న అల్లు అర్జున్.. ఆ వార్త విని షాకయ్యారు. ఆయన కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువు మరణించడంతో అల్లు ఫ్యామిలీ కృంగిపోయింది. వివరాల్లోకిపోతే..

 అల్లు అర్జున్‌ మామ హఠాన్మరణం

అల్లు అర్జున్‌ మామ హఠాన్మరణం

అల్లు అర్జున్ తల్లి నిర్మల దేవి తరుపున బంధువు, అల్లు అర్జున్‌కి వరుసకు మామ అయిన ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం చెందారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన విజయవాడలో మృతి చెందారు. ఈ విషయం తెలిసి విజయానందంలో ఉన్న అల్లు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయింది.

అల్లు అర్జున్‌తో సన్నిహితంగా..

అల్లు అర్జున్‌తో సన్నిహితంగా..

హఠాన్మరణం చెందిన ముత్తంశెట్టి ప్రసాద్ అల్లు అర్జున్‌కు పెద్ద మామయ్య వరస అవుతాడని సమాచారం. ఆయనతో అల్లు అర్జున్ చాలా సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని అంటున్నారు. అల్లు కుటుంబంతో ఆయన ఎంతో కలివిడిగా ఉండేవారట.

సుకుమార్ సినిమాకు నిర్మాతగా ముత్తంశెట్టి

సుకుమార్ సినిమాకు నిర్మాతగా ముత్తంశెట్టి

అల.. వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమా నిర్మాణంలో ముత్తంశెట్టి ప్రసాద్ కూడా భాగం పంచుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఆయన కూడా ఓ నిర్మాతగా ఉన్నారు.

హుటాహుటిన విజయవాడకు అల్లు ఫ్యామిలీ.

హుటాహుటిన విజయవాడకు అల్లు ఫ్యామిలీ.

చిన్నప్పటి నుంచి కూడా మామతో చాలా సన్నిహితంగా ఉన్నాడు బన్నీ. ఈ నేపథ్యంలో ముత్తంశెట్టి ప్రసాద్ మరణవార్త విని అల్లు కుటుంబం జీర్ణించుకోలేక పోతోంది. ఆయన మృతిచెందారని తెలియగానే హుటాహుటిన విజయవాడకు బయల్దేరింది అల్లు ఫ్యామిలీ.

పలువురి సంతాపం.. అంత్యక్రియలు

పలువురి సంతాపం.. అంత్యక్రియలు

సినీ ఇండస్ట్రీతో కూడా ముత్తంశెట్టి ప్రసాద్‌కి టచ్ ఉంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు (జనవరి 23) జరగనున్నట్లు సమాచారం అందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X