‘వేదం’కోసం మలయాళ మాంత్రికుల పాట్లు...

By Sindhu

అల్లు అర్జున్ నటించిన వేదం సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొంటున్నది. ఈ సినిమాలో బన్నీతో పాటు మనోజ్ కుమార్, అనుష్క, మనోజ్ బాజ్ పాయ్, నాగయ్య, శరణ్య నటన హైలైట్. ఇలాంటి సినిమాని దర్శకుడు క్రిష్ శక్తి వంచనలేకుండా తెరకెక్కించాడు. ఒక వర్గం వారే టెర్రరిస్ట్ లు కాదని మరో వర్గం వారు మతం మత్తులో టెర్రరిస్ట్ లుగా ప్రవర్తిస్తున్నారని దర్శకుడు క్రిష్ చెప్పకనే చెప్పారు. మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు ఇలాంటి సినిమా చూడాలని సమాజంలో ప్రతి ఒక్కరికీ ఎదురుపడే క్యారెక్టర్లే ఇందులో కనపడుతున్నాయని పలువురి హీరోల అభిమానులు అభిప్రాయం. ఇలాంటి సినిమాలు తెరకెక్కించడంలో మలయాళ మాత్రికుల(దర్శకుల)కు అందెవేసిన చెయ్యి. ఇలాంటి సినిమాలని మలయాల దర్శకుడు షాజీకైలాస్ ఇంతకు ముందే తెరకెక్కించారు. అందులో మమ్ముట్టి హీరోగా చేశారు. కానీ ఆ సినిమాలో రెండు క్యారెక్టర్లే ప్రధాన పాత్ర పోషించాయి. కేరళలో అల్లు అర్జున్ కి లక్షల మంది అభిమానులు ఉన్నారు. బన్నీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆర్య2 వంద ప్రింట్స్ తో కేరళలో విడుదలై విజయఢంకా మ్రోగించింది.

మలయాళ సినీ అభిమానులకు ఎలాంటి సినిమా కావాలో అదేవిధంగా తెరకెక్కిన వేదం సినిమా హక్కులు పొందడానికి మలయాళ సినీ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్, క్రిష్, వేదం నిర్మాతలను సంప్రదించి రూ. 7కోట్లు అయినా సరే హక్కులు తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఈ సినిమా హక్కులు పొందితే, డబ్బింగ్ చేసి కోట్లరూపాయలు సంపాదించాలని నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు వేదం సినిమా నిర్మాతలే ఈ సినిమాని మలయాలంలో డబ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మరి అయితే తెలుగు కంటే మలయాళంలోనే ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అంచనావేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X