»   » అల్లు అర్జున్ కి కాబోయే వైఫ్ పవన్ కళ్యాన్ భార్య రేణుదేశాయ్ లా ఉండాలట!

అల్లు అర్జున్ కి కాబోయే వైఫ్ పవన్ కళ్యాన్ భార్య రేణుదేశాయ్ లా ఉండాలట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాథ్ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఈ మద్య అల్లు అర్జున్ చాలా బిజీగా ఉంటున్నాడు. మరోవైపు అతని సోదరుడు అల్లు శిరీష్ కూడా యమా బిజీగా ఉంటున్నాడు. అందుకని హాలిడే తీసుకుని అలసట తీర్చుకోవాలని అనుకున్నారు కాబోలు మొత్తం కుంటుంబమంతా కలిసి అమెరికా వెళ్లారని సమాచారం. ప్రస్తుతం లాస్ వేగాస్ లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ తో కలిసి ఉంటున్నారట. మొత్తానికి అల్లు కుటుంబం అమెరికాలో సందడి సందడిగా గడిపేస్తోంది. ఈ సందడి ఇలా సాగుతుండగా మరోవైపు అల్లు అర్జున్ ని ఓ ఇంటివాడిని చేయడానికి అల్లు అరవింద్ తగిన సంబంధాల కోసం అన్వేషిస్తున్నాడట.

అయితే అల్లు అర్జున్ అమ్మగారి అభిప్రాయం అడుగగా, చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కెనడా కి వెళ్ళాల్సిన వాడు, అయితే సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడని, సినిమాలు చేస్తాడని తను ఊహించలేదన్నారు. 'గంగోత్రి" తో పరిచయమైన అల్లు అర్జున్ తర్వాత అతని గురించి వెనుదిరిగి ఆలోచించలేదన్నారు. అయితే బన్నీ మంచి జిమ్నాటిస్ట్ అని, తన గురించి తానే మంచి కేర్ తీసుకొంటాడు ఏసమయానికి ఏం తినాలి, ఎలాఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకోవాలనేది అతనికి బాగా తెలుసని చెప్పుకొచ్చారు.

సినిమాలలోకి ప్రవేశించిన తర్వాత కూడా సినిమాల గురించి తన తండ్రి హెల్స్ ఎప్పుడు తీసుకోలేదు. అందుకే అతని పెళ్లి విషయంలో కూడా తనకే ఛాన్స్ ఇచ్చాము అయితే అల్లు అర్జున్ తిరిగి మాకే బాద్యతను గుర్తుచేశాడు. అందుకోసమే ఒక మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాం అన్నారు. అయితే ఆ అమ్మాయి అందంతో పాటు మాతో ప్రీగా కలిసిపోయే విధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ వైఫ్ రేణుదేశాయ్ డిఫ్రెంట్ బ్యాక్ గ్రౌండ్ అయినా కూడా మాతో చాలా బాగా కలిసిపోయింది. అలాంటి అమ్మాయి అయితే బాగుంటుందిని మా అభిప్రాయం అంటూ తెలియజేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu