»   » అల్లు అర్జున్‌ భార్య భుజానికి ఆపరేషన్

అల్లు అర్జున్‌ భార్య భుజానికి ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి భుజానికి మంగళవారం శస్త్ర చికిత్స జరిగింది. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో స్నేహారెడ్డి భుజానికి గాయమైనట్లు సమచారం. అప్పట్లో వేరే ఆసుపత్రిలో చికిత్స చేసినప్పటికీ గాయం మానలేదు. ఇటీవలి తరచూ భుజంలో నొప్పి రావడంతో మంగళవారం ఆమె సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చేరారు.

పరీక్షించిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌.. శస్త్ర చికిత్స చేశారు. మంగళవారం ఉదయం అల్లు అర్జున్‌ ఆసుపత్రికి వచ్చి కొద్ది సేపు భార్య వద్ద ఉండి వెళ్లారు. స్నేహ మామ అల్లు అరవింద్‌ కూడా సాయంత్రం ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడి వెళ్లారు. బుధవారం ఆమెను డిశ్చార్జి చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Allu Arjun's Wife Sneha Undergoes Surgery

అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే....

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట.

యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
Arjun's wife Sneha Reddy was undergoing a minor surgery. Sneha is admitted to hospital for minor surgery and she will be discharged by evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu