Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అల్లు అర్జున్, సమంత రెండవసారి.. దూసుకుపోతోంది!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడు. ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆ దిశగా అన్ని పనులు జరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధం చేసిన విక్రమ్ కుమార్ ప్రస్తుతం నటీ నటుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత అంటూ న్యూస్ వైరల్ గా మారింది.
రెండవసారి
బన్నీ, సమంత ఇప్పటికే ఓ చిత్రంలో నటించారు. వీరిద్దరూ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి అనే చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా విక్రమ్ కుమార్ బన్నీతో తెరకెక్కించే చిత్రం కోసం సమంతనే ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నీలో స్వార్థం లేదు, గర్వంగా ఉంది: పవన్ కళ్యాణ్ మీద సమంత ట్వీట్
ఓకే చెప్పిన సమంత
విక్రమ్ కుమార్ ఇటీవలే సమంతని కలసి కథ వివరించాడట. విక్రమ్ కుమార్ చెప్పిన కథ, తన పాత్ర నచ్చడంతో సమంత ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలివుందని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ స్థాయిలో
సమంత ఇదివరకే మనం చిత్రంలో విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటించింది. ఇక అల్లు అర్జున్ చిత్రాన్ని విక్రమ్ కుమార్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. పునర్జన్మల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనేది వినికిడి.
హరికృష్ణ మరణం: సమంత పొరపాటుకు మూల్యం... గట్టిగా క్లాస్ పీకారు!
విజయం కోసం
2016 లో వచ్చిన సరైనోడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన డీజే పరవాలేదనిపించగా, నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచింది. దీనితో ఈ సారి ఎలాగైనా ఘనవిజయం సాధించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడు.
దూసుకుపోతూ
ఇక సమంత ఈ ఏడాది వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది సమంత నుంచి వచ్చిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. రంగస్థలం, మహా నటి, అభిమన్యుడు చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.