twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్, సమంత రెండవసారి.. దూసుకుపోతోంది!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడు. ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆ దిశగా అన్ని పనులు జరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధం చేసిన విక్రమ్ కుమార్ ప్రస్తుతం నటీ నటుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

     రెండవసారి

    రెండవసారి

    బన్నీ, సమంత ఇప్పటికే ఓ చిత్రంలో నటించారు. వీరిద్దరూ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి అనే చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా విక్రమ్ కుమార్ బన్నీతో తెరకెక్కించే చిత్రం కోసం సమంతనే ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    నీలో స్వార్థం లేదు, గర్వంగా ఉంది: పవన్ కళ్యాణ్ మీద సమంత ట్వీట్నీలో స్వార్థం లేదు, గర్వంగా ఉంది: పవన్ కళ్యాణ్ మీద సమంత ట్వీట్

     ఓకే చెప్పిన సమంత

    ఓకే చెప్పిన సమంత

    విక్రమ్ కుమార్ ఇటీవలే సమంతని కలసి కథ వివరించాడట. విక్రమ్ కుమార్ చెప్పిన కథ, తన పాత్ర నచ్చడంతో సమంత ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలివుందని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    భారీ స్థాయిలో

    భారీ స్థాయిలో

    సమంత ఇదివరకే మనం చిత్రంలో విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటించింది. ఇక అల్లు అర్జున్ చిత్రాన్ని విక్రమ్ కుమార్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. పునర్జన్మల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనేది వినికిడి.

    హరికృష్ణ మరణం: సమంత పొరపాటుకు మూల్యం... గట్టిగా క్లాస్ పీకారు!హరికృష్ణ మరణం: సమంత పొరపాటుకు మూల్యం... గట్టిగా క్లాస్ పీకారు!

    విజయం కోసం

    విజయం కోసం

    2016 లో వచ్చిన సరైనోడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన డీజే పరవాలేదనిపించగా, నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచింది. దీనితో ఈ సారి ఎలాగైనా ఘనవిజయం సాధించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడు.

    దూసుకుపోతూ

    దూసుకుపోతూ

    ఇక సమంత ఈ ఏడాది వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది సమంత నుంచి వచ్చిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. రంగస్థలం, మహా నటి, అభిమన్యుడు చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

    English summary
    Allu Arjun and Samantha team up for Vikram Kumar film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X