ఆ యాడ్ కాన్సెప్ట్‌కు ఇన్‌స్పిరేషన్ అతడే.. నవదీప్ పరువుదీసిన అల్లు అర్జున్

ప్రస్తుతం ఓటీటీ హవా ఏ రేంజ్‌లో నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఓటీటీ అనేది ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ కరోనా, లాక్డౌన్ వల్ల అది మరింత పాపులర్ అయింది. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో భాగమయ్యారు. ఓటీటీలోని షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఎంతేసేపు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ పేర్లే వింటాం. కానీ ప్రాంతీయంగా ఒక్క ఓటీటీ సంస్థ కూడా లేదనుకునే సమయంలో అల్లు అరవింద్ ఆహాతో ముందుకు వచ్చాడు.

ఆహా పాపులర్..

ఆహా పాపులర్..


లాక్డౌన్‌లో ఆహా యాప్ ఫుల్ పాపులర్ అయింది. ఆహాలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు బాగానే క్లిక్ అయ్యాయి. కృష్ణ అండ్ హిజ్ లీలా, భానుమతి రామకృష్ణ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. తాజాగా కలర్ ఫోటో తెగ వైరల్అయింది. అయితే ఈ ఆహా యాప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారీ ఎత్తున వచ్చారు. దీని కోసం అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగాడు.

స్పెషల్ షోలు..

స్పెషల్ షోలు..

ఆహా కోసం అల్లు అర్జున్ స్పెషల్ షోలు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఆహాకు పునాది ఎలా జరిగింది? ఎవరెవరు ఇందులో భాగస్వామి అయ్యారన్న సంగతులన్నీ చెప్పాడు. అల వైకుంఠపురములో సినిమా సమయంలో ఆహా టీం తన వద్దకు వచ్చిందని, ఏదో ఒకటి చేయాలని అన్నారట. అందుకే త్రివిక్రమ్‌తో కలిసి ఓ స్పెషల్ యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ యాడ్ గురించి చెబుతూ అల్లు అర్జున్ నవదీప్ పరువుతీసేశాడు.

ఆహా యాడ్..

ఆహా యాడ్..


త్రివిక్రమ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఆహా కోసం చేసిన ఈ యాప్.. తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో తన ప్రియురాలి ఒంటరిగా ఉండటంతో బన్నీ వెళ్తాడు. ఆమెతో రొమాన్స్ చేయాలని ప్రయత్నిస్తుంటే అమ్మాయి నాన్న వస్తాడు. ఎవరైనా అబ్బాయి ఉన్నాడా? అంటూ మంచం కింద చూస్తాడు తండ్రి. ఆ తరువాత అన్న వచ్చి కప్ బోర్డ్‌లో వెతుకుతాడు. ఇంత వరకు ఏం చేస్తున్నావ్ అని ఆ అమ్మాయి అడిగితే ఆహా చూస్తున్నాని చెబుతాడు బన్నీ.

Recommended Video

#MaaVinthaGadhaVinuma: Seerat Kapoor, Siddhartha Chit Chat With Allu Aravind || Filmibeat Telugu
ఆ యాడ్‌కు నవదీప్ స్ఫూర్తి..

ఆ యాడ్‌కు నవదీప్ స్ఫూర్తి..

అయితే ఇంట్లో దూరడం, ప్రేయసితో రొమాన్స్ చేయడం వంటివి ప్లే బాయ్ అయిన నవదీప్‌కు బాగా సూట్ అవుతాయని అందరికీ తెలిసిందే. బన్నీ కూడా అలానే చెబుతూ.. ఈ యాడ్‌కు నవదీప్ స్పూర్తి అతన్ని చూసే ఈ కాన్సెప్ట్ తీశామని కౌంటర్ వేశాడు. దీంతో నవదీప్ పగలబడి నవ్వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X