పకడో పకడోకు స్టెప్పులేస్తున్నా: బన్నీ
జులాయి చిత్రానికి సంబంధించిన ప్రోమో పాట చిత్రీకరణ హైదరాబాద్ పాతబస్తీలోని ఓ కాలేజీలో జరుగుతోంది. దేవిశ్రీ, అల్లు అర్జున్‌పై చిత్రీకరిస్తున్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ "ఖాళీగా తిరిగేవాడిని జులాయి అంటారు. ఈజీ మనీ కరెక్ట్ కాదని చెప్పే సినిమా ఇది. బన్నీ గత చిత్రాలన్నింటికీ భిన్నంగా ఇందులో కనిపిస్తారు. జులాయిగా తిరిగే కుర్రాడు మంచిగా ఎలా మారాడన్నది ఆసక్తికరం. నాకు హ్యూమర్ అంటే ఇష్టం. బన్నీ చాలా సరదాగా ఉంటాడు. దేవిశ్రీ మంచి సంగీతాన్నిచ్చారు. గతంలో 'జల్సా'కు ప్రోమో చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు చేస్తున్నాం'' అని అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ చెబుతూ "సరదాగా పిక్నిక్ చేసినట్టు అనిపిస్తోంది. 'జల్సా'ను మర్చిపోలేను. బన్నీతో ఇది నాలుగో చిత్రం. మా ఇద్దరి కెమిస్ట్రీ కుదిరిందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆయన్ని చూసి పక్కన స్టెప్పులేస్తున్నాను. సినిమా చూశాను. బన్నీ వెరైటీ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ డైలాగుల గురించి ఎంత చెప్పినా తక్కువే'' అని తెలిపారు.
బన్నీ మాట్లాడుతూ "ప్రమోషనల్ సాంగ్ చేయాలన్న కాన్సెప్ట్ త్రివిక్రమ్, దేవిశ్రీలదే. 'పకడో పకడో' అనే పాటకు నేను, దేవి స్టెప్పులేస్తున్నాం. ఈ పాట మరో వెర్షన్ సినిమాలో ఉంటుంది. మామూలుగా కథకు ప్రాముఖ్యతనిస్తారు. నేను త్రివిక్రమ్‌తో చేయాలని కోరుకున్నాను. ఆ తర్వాతే కథ గురించి ఆలోచించాం. జులాయి టైటిల్ నాకు చాలా యాప్ట్‌గా ఉంటుంది. ఇందులో ఐటెమ్‌సాంగ్‌లు లేవు. ఓ మాస్ పాట ఉంది. ఇందులోని డైలాగులతో త్రివిక్రమ్ ఆయన ట్రెండ్‌ను ఆయనే బ్రేక్ చేస్తారు" అని అన్నారు.
"సినిమా బాగా వచ్చింది. బన్నీ కొత్తగా కనిపిస్తారు. క్రెడిట్ అంతా దర్శకుడిదే. మొత్తం తానే అయి సినిమాను చూసుకున్నారు. ఈ నెల 13న సిరి మీడియా ద్వారా విడుదల చేస్తున్నాం'' అని దానయ్య చెప్పారు. సిరి మీడియా ప్రసాద్ మాట్లాడుతూ " ఈ నెల 13న మన రాష్ట్రంలో మాత్రం 1200 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆడియోకు వెబ్‌సైట్లలో 4.5 రేటింగ్ వచ్చింది'' అని తెలిపారు.
అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటించిన 'జులాయి' ఈ నెల 13న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. దానయ్య సమర్పిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మాత.


Click it and Unblock the Notifications











