‘ఆర్య2’ టైటిల్ ఖరారు

By Staff

సుకుమార్ దర్శకత్వం, ఆదిత్యబాబు నిర్మాణంలో రూపొందున్న చిత్రం టైటిల్ ను 'ఆర్య2"గా దృవీకరించారు. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొన్నది. నిర్మాణాత్మక పనులు పూర్తిచేసుకొంటున్నదని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాను దసరా కానుకగా ఆడియన్స్ ముందుకి ఈ నెలాఖరులో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వం శ్రీవెంకటేశ్వర ఫిల్మ్ బ్యానర్లో రూపొందిన చిత్రం 'ఆర్య" ఈ సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య బాబు ఆద్వర్యం లో రూపొందుతున్న చిత్రానికి టైటిల్ ను 'ఆర్య 2" గా నిర్ణయించారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కాజల్ కథానాయికగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇంకా నవదీప్, శ్రద్దదాస్ మరో ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం హైలెట్ అవుతుందంటున్నారు. నిర్మాణాత్మక పనులు పూర్తి చేసుకొని త్వరలో ఆడియోను రిలీజ్ చేస్తామంటున్నారు.

మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ తొలిసారిగా సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను పోషిస్తున్నారు. తమిళ హీరో ఆర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే వారంలో ఆడియో విడుదల చేసి, ఈ నెలాఖరులో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, జెన్నీ, తిలక్, జూనియర్ రేలంగి, ఎం.శ్యాంసుందర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X