బన్నీ కేరాఫ్ 'సిక్స్ పాక్..సెవెన్ అప్'
అల్లు అర్జున్ సెవన్ అప్ కోసం చేసిన కొత్త యాడ్ అంతటా చర్చగా మారింది. అందులో అతను డాన్సింగ్ సీక్రెట్స్, అల్లు అర్జున్ స్ బిగ్ బ్యాంగ్ ధీరీ, అల్లు ఎట్ ఎయిర్ పోర్ట్, అల్లు ఫిట్ హిట్ అంటూ వీడియోలు ఉంచారు. ఇవి అల్లు అర్జున్ అభిమానులను బాగా అలరిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం వివి వినాయిక్ దర్శకత్వంలో బద్రీనాధ్ చిత్రంలో చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేసే ఈ చిత్రం గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం అవుతుంది. నరసింహనాయుడు, గంగోత్రి చిత్రాలకు కథలు అందించిన చిన్ని కృష్ణ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్, మంచు మనోజ్ కాంబినేషన్లో రూపొందిన వేదం చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మొన్నటి వరకూ సిక్స్ పాక్ క్రేజ్ తో అల్లు అర్జున్ గురించి చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు సెవన్ అప్ గురించి మాట్లాడుకోవటం విశేషం.
అల్లు అర్జున్ బద్రీనాధ్ వివి వినాయిక్ క్రిష్ వేదం మంచు మనోజ్ allu arjun badrinath vv vinayak krish vedam anushka


Click it and Unblock the Notifications