ఫిలిం సిటిలో అల్లు అర్జున్- స్టన్ట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఫైటింగ్...
గీతా ఆర్ట్స్ పతాకంపై 'అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'బద్రినాధ్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క లో అల్లు అర్జున్, తమన్నా హీరొ హీరోయిన్లుగా …ప్రకాష్ రాజ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు ఆరవింద్ ఈ చిత్రానికి నిర్మాత.
ఇటీవలే కూలు మనాలి లో రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ ముగించుకుని సెప్టెంబర్ 25న వచ్చిన 'బద్రినాధ్" చిత్ర బృందం, తాజాగా హైదరాబాదులోని రామోజి ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో అల్లు అర్జున్ పాల్గొనగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీటర్ ఆనంద్ సాయి ఈ సెట్ కి రూపకర్త. చిన్ని కృష్ణ కథను సమకూర్చిన ఈ చిత్రానికి సంగీతం యమ్ యమ్ కీరవాణి. రవి వర్మ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











