»   » గమ్మునుండవోయ్: మళ్లీ బన్నీని రెచ్చగొట్టిన పవన్ ఫ్యాన్స్...

గమ్మునుండవోయ్: మళ్లీ బన్నీని రెచ్చగొట్టిన పవన్ ఫ్యాన్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య 'సరైనోడు' సినిమాకు సంబంధించిన వేడుకలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రాజుకున్న వివాదం ఎంత పెద్ద గొడవకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాన్ గురించి నేను 'చెప్పను బ్రదర్' అన్నందుకు బన్నీని సోషల్ మీడియా ద్వారా అబాసుపాలు చేసారు పవర్ స్టార్ ఫ్యాన్స్.


పవన్ దూరం: మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కో బాధ్యత...(పూర్తి డీటేల్స్)

'చెప్పను బ్రదర్' వివాదంలో బన్నీ తప్పేమీ లేదు. వాస్తవానికి అప్పుడు బన్నీ తన సినిమా ప్రమోషన్లో సీరియస్ గా ఉన్నారు. పవర్ స్టార్ అభిమానుల్లో కొందరు ఆకతాయిలు కావాలనే బన్నీని డిస్ట్రబ్ చేయడంతో బన్నీ అలా అనాల్సి వచ్చింది. తర్వాత 'ఒక మనసు' ఆడియో వేడుకలో పవర్ స్టార్ అభిమానులకు, మెగా అభిమానులకు తగిన సమాధానం చెప్పాడు, పవర్ స్టార్ పట్ల తనకున్న ఇష్టాన్ని, అభిమానానం గురించి చెప్పి....అనవసర రాద్దాంతం చేస్తున్న వారి నోరు మూయించారు బన్నీ. పద్దతిగా ఉండటం నేర్చుకోండి అంటూ బుద్దిచెప్పే ప్రయత్నం చేసారు. దాంతో ఆ వివాదం ముగిసినట్లయింది.

నిర్వాణ బర్త్ డే పార్టీ: చీఫ్ గెస్టులు బాలయ్య మనవడు, బన్నీ కొడుకు (ఫోటోస్)

అయితే బన్నీ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సింగపూర్ లో గురువారం జరిగిన సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రకు గాను క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయన మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

మళ్లీ అదేగోల

మళ్లీ అదేగోల

బన్నీ మాట్లాడుతుంటే మళ్లీ కొందరు ఆకతాయి అభిమానులు మళ్లీ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ గోల చేసారు.

గమ్మునుండవోవ్...మాట్లాడనీ

గమ్మునుండవోవ్...మాట్లాడనీ

వారి గొడవతో అసహనానికి గురైన అల్లు అర్జున్ ‘గమ్మునుండవోయ్...మాట్లాడనీ' అంటూ వారి నోరు మూయించే ప్రయత్నం చేసారు.

కావాలనే రెచ్చగొట్టడం

కావాలనే రెచ్చగొట్టడం

కావాలనే బన్నీని రెచ్చగొట్టి అతనితో ఆడుకోవాలనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

కొందరు ఫ్యాన్స్ ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

English summary
At SIIMA 2016 event other day, few fans has started shouting Powerstar shouts immediately when Allu Arjun received Best Actor (Male- Critics choice) at Singapore other day. Just before starting his speech, Bunny said, "Nuvvu Gammunundavoyi" and then continued with his speech. Film fraternity has got stunned with these happenings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu