కడుపుతో ఉన్న భార్యతో అల్లు అర్జున్ ఇలా (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. నిండు గర్భవతిగా ఉన్న స్నేహారెడ్డితో కలిసి దిగిన ఓ ఫోటో పోస్టు చేసిన అల్లు అర్జున్.....'ఎక్స్‌పెక్టింగ్ ఎనీ టైం నౌ' అంటూ సోషల్ నెట్వర్కింగులో ఓ మెసేజ్ పోస్టు చేసాడు. దీంతో అభిమానులంతా ఎప్పుడు శుభవార్త వింటామా? అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

ఓ వైపు తండ్రిని కాబోతున్నాననే ఎగ్జైట్మెంట్, మరో వైపు తన తాజా సినిమా 'రేసు గుర్రం' విడుదలకు సిద్ధమైన ఆనందం వెరసి......అల్లు అర్జున్ తన జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నారు. రేసు గుర్రం చిత్రం షూటింగ్ గత కొంతకాలం క్రితమే ముగిసింది. అప్పటి నుండి భార్య వద్దే గడుపుతున్నాడట బన్నీ.

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తాజాగా పోస్టు చేసిన ఫోటోతో పాటు, వారిన అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఇతర ఫోటోలు స్లైడ్ షోలో....

ఎక్స్‌పెక్టింగ్ ఎనీ టైం నౌ

ఎక్స్‌పెక్టింగ్ ఎనీ టైం నౌ

తన సోషల్ నెట్వర్కింగులో ఈ ఫోటో తో పాటు ‘ఎక్స్‌పెక్టింగ్ ఎనీ టైం నౌ' అనే సందేశం పోస్టు చేసాడు అల్లు అర్జున్.

స్నేహారెడ్డి -అల్లు అర్జున్

స్నేహారెడ్డి -అల్లు అర్జున్

స్నేహారెడ్డి అల్లు అర్జున్ ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపస్తుందో తెలియదు కానీ....అల్లు అర్జున్, స్నేహా రెడ్డి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది.

భార్యతో డాన్స్...

భార్యతో డాన్స్...

సినిమాల్లో కూడా అల్లు అర్జున్ ఇలా చాలా సార్లు కనిపించారు. కానీ అది నటన. ఇది రియల్. బన్నీ మనసు నిండా నిజమైన సంతోషం నిండి ఉంది.

సినిమాలో కాదు లెండి!

సినిమాలో కాదు లెండి!

ఈ ఫోటో చూస్తుంటే....ఏదో సినిమా స్టిల్ లా ఉంది కాదూ. కానీ ఇది సినిమా కాదు. రియల్ లైఫ్ పిక్చర్. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రత్యేక తీయించుకున్న ఫోటో. సూపర్బ్ గా ఉంది కదూ...

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఇద్దరమ్మాయిలతో షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలా ఉంది. ఈ స్టిల్ చూస్తుంటే ఆ సినిమాలో స్నేహా రెడ్డి నటిస్తే బన్నీకీ పర్ ఫెక్టుగా సూటయ్యేది అని అంటున్నారంతా.

ప్రేమ కౌగిలి

ప్రేమ కౌగిలి

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి మధ్య ఎంత అనురాగ ప్రేమ బంధం ఉందో....ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు.

స్పెయిన్లో...

స్పెయిన్లో...

ఇద్దరమ్మాయిలతో చిత్రం స్పెయిన్లో జరిగినపుడు...బన్నీతో పాటు స్నేహా రెడ్డి కూడా వెళ్లారు. అక్కడ దిగిందే ఈ ఫోటో...

స్వీట్ మెమొరీస్...

స్వీట్ మెమొరీస్...

ఒక వయసొచ్చాక తమ జీవితంలో గడిచిపోయిన పేజీలను తిరిగి చూసుకోవాలంటే...ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఉండాల్సిందే...

అన్యోన్య దాంపత్యం

అన్యోన్య దాంపత్యం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X