»   »  మతిపోగొడుతున్న లుక్: భార్యతో కలిసి అల్లు అర్జున్ పార్టీలో...

మతిపోగొడుతున్న లుక్: భార్యతో కలిసి అల్లు అర్జున్ పార్టీలో...

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసిన ఓ ఫోటో అభిమానుల మతి పోగొడుతోంది. బన్నీ-స్నేహారెడ్డి ఈ ఫోటోలో గతంలో కంటే మరింత అందంగా కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరూ ఓ ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. 'ఎంగేజ్మెంట్ పార్టీ ! లవ్లీ వైబ్స్' అంటూ బన్నీ ఈ ఫోటోకు క్యాపన్షన్ పెట్టారు.

  జంట అదిరిపోయింది

  జంట అదిరిపోయింది

  ఈ ఫోటోలో బన్నీ బ్లాక్ కలర్ ఔట్ పిట్‌లో దర్శనమివ్వగా... స్నేహారెడ్డి ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్రీమ్ కలర్ డ్రెస్ ధరించారు. ఈ ఫోటోకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. దీన్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ మురిసి పోతున్నారు.

  భారీగా లైక్స్, కామెంట్స్

  భారీగా లైక్స్, కామెంట్స్

  కొన్ని గంటల క్రితం ఈ ఫోటో బన్నీ తన అఫీషియల్ ఇన్‌స్టా పేజీలో పోస్టు చేయగా.... ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల లైక్స్ వచ్చాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్, బెస్ట్ కపుల్, స్వీట్ కపుల్ ఆఫ్ టాలీవుడ్, ఇంత అందమైన జంటను ఎప్పుడూ చూడలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

   అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  బన్నీ సినిమాల గురించి మాట్లాడితే.... ఆయన నటించిన ‘నా పేరు సూర్య' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఎబో యావరేజ్‌గా నిలిచింది. దీంతో తన తర్వాతి సినిమాపై బన్నీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇందుకోసం చాలా కథలు వింటున్నాడు. ఇంకా ఏ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా ఖరారు కాలేదు.

  నెక్ట్స్ ఆ దర్శకుడితోనేనా?

  నెక్ట్స్ ఆ దర్శకుడితోనేనా?

  బన్నీ తర్వాతి సినిమా 24, మనం చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా అక్టోబర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

   బాలీవుడ్ వెళుతున్నాడా?

  బాలీవుడ్ వెళుతున్నాడా?

  మరో వైపు బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, రణవీర్ సింగ్‌తో కలిసి 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించబోతున్నాడని, ఇందులో స్టైలిష్ స్టార్ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.

  English summary
  Allu Arjun shared a picture of him posing with his loving wife Sneha Reddy on his photo sharing site- Instagram and it’s too stunning to miss. Bunny captioned the pic, “Engagement Party ! Lovely Vibe.” Stylish Star Allu Arjun and Sneha Reddy make an adorable pair. The couple recently attended an engagement party.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more