అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల పెళ్శి రోజు అదేనా..
అల్లు అర్జున్ తన బ్యాచిలర్ జీవితానికి మార్చి 5వ తారీఖుతో స్వస్తి పలకనున్నారు. అదేంటి మార్చి 5 స్పెషాలిటీ అని అనుకుంటున్నారా..మార్చి 5న మన బన్ని తను ప్రేమించినటువంటి స్నేహారెడ్డిని పెళ్శి చేసుకోబోతున్నట్టు సమాచారం. 2010 సంవత్సరంలో వరుడుగా పరాజయం చవిచూసిన అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో మాత్రం వరుడుగా సక్సెస్ ను చూడబోతున్నాడు. ప్రేమించిన స్నేహరెడ్డితోనే తన పెళ్శిని ఫిక్స్ చేసుకున్న బన్ని ఎంగేజ్ మెంట్ కూడా ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను మార్చి 5న నిజ జీవితంలో వరుడుగా చూడొచ్చు.
ప్రస్తుతం అల్లు అర్జున్ వివి వినాయక్ దర్సకత్వంలో బద్రినాధ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పంజాభీ ముద్దు గుమ్మ తమన్నా భాటియా హీరోయిన్ గానటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇకపోతే ఈసినిమాకు కధ మాత్రం చిన్ని కృష్ణ అందించారు. గతంలో ఈయన ఇంద్ర, నరసింహానాయుడు, గంగోత్రి లాంటి హిట్ సినిమాలకు కధ అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తుంది.


Click it and Unblock the Notifications











