అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం, మార్చి 6న సుమూహుర్తం
హైదరాబాద్: యంగ్ హీరో అల్లు అర్జున్ వివాహానికి మార్చిలో ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తారీఖున హైదరాబాద్‌లోని హైటెక్ట్స్‌లో అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. 9వ తారీఖున పాలకొల్లులో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలకు అధిపతి అయిన శేఖరరెడ్డి కూతురు స్నేహారెడ్డితో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. అయితే అల్లు అర్జున్ బద్రినాథ్ చిత్రీకరణ హడావుడిలో ఉండటంతో పెళ్లికి కాస్త సమయం పడుతుందని అప్పుడే రెండు కుటుంబాలు చెప్పాయి. స్నేహారెడ్డి అమెరికాలో ఎమ్మెస్ చేసింది.
కాగా అల్లు అర్జున్ గత కొంతకాలంగా స్నేహారెడ్డితో ప్రేమ నడుపుతున్నట్లు వార్తలు అప్పట్లో వార్తలు వచ్చాయి. మీడియాలో ప్రధానంగా ఆ వార్తలు రావడంతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆ వార్తలను కొట్టి పారేశారు. అయితే అనంతరం ఇరుకుటుంబాలు చర్చించుకొని పెళ్లికి అంగీకరించారు. ప్రేమ పెళ్లి కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే అర్జున్ బద్రినాథ్ షూటింగ్‌లో ఉన్నందున పెళ్లికి ఆ చిత్రం పూర్తయిన తర్వాత చేస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











