మెగా ఫ్యామిలీ ఇంట మస్త్ మస్త్ గా సాగిన ‘సంగీత్’ కార్యక్రమం...
అల్లు అర్జున్ ఇంట్లో నిన్న రాత్రి (మార్చి 3) 'సంగీత్' కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో, ఉత్సాహంగా, ఉల్లాసంగా మస్త్ మస్త్ గా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులంతా విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని రంజింపజేసారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చిందేసి వాతావరణాన్ని ఉత్సాహపరిచారు. వధూవరులు బన్నీ, స్నేహా రెడ్డి కలిసి చిరంజీవి ఆల్ టైం హిట్ నంబరైన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు...' పాటకు స్టెప్స్ వేస్తూ చేసిన డ్యాన్స్ అందర్నీ అలరించింది. అతిథులంతా ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ హర్షాతిరేకాన్ని వ్యక్తపరిచారు.
అలాగే, రామ్ చరణ్, బన్నీ, ధర్మతేజ్ కల్సి 'బంగారం' సినిమాలోని 'రా.. రా... రా బంగారం' పాటకు చేసిన డ్యాన్సు కూడా ఉషారుగా సాగింది. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కూడా రెండు పాటలకు చిందేశాడు. ఇక కొంత మంది ప్రదర్శించిన స్కిట్స్ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాయి. నవదీప్, మధుశాలిని, శర్వానంద్, అర్చన, వేణుమాధవ్ లు వేసిన ఓ స్కిట్ హాస్యాన్ని ఒలికించింది. అలాగే, ఓ స్కిట్ లో బన్నీగా రాణా, స్నేహాగా ప్రియ, స్నేహా డాడీగా సునీల్, రామ్ చరణ్ గా రామ్ చరణ్ ప్రదర్శించిన స్కిట్ అందరికీ చక్కిలిగింతలు పెట్టింది.
కాగా ఈ సంతోషాన్ని తమ అభిమాను కోసం రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. బన్నీకి పెళ్లి అంటే నమ్మలేకపోతున్నాను. కానీ చాలా సంతోషంగా ఉంది. సంగీత్ కార్యక్రమం చాలా ఆహ్లదకరంగా జరిగింది. బాగా ఎంజాయ్ చేశాం.ఇదంతా బన్నీ కోసమే అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











