పవన్ కళ్యాణ్ ను బన్నీ మంచిపోతాడా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సోషల్ రెస్పాన్సబులిటీగా ఉంటారనే పేరు ఉంది. తాజాగా అల్లు అర్జున్ కూడా ఆయన దారిలోనే ప్రయాణిస్తున్నాడు. అల్లు అర్జున్ స్వయంగా నటించిన నిర్మించి 'ఐ యామ్ దట్ ఛేంజ్' షార్ట్ ఫిల్మ్ ఆగస్టు 15న సందర్భంగా విడుదలైంది.
ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వారంతా ఈ షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించడం కూడా దేభభక్తే అంటూ....సాగిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రజలకు తమ తమ సోషల్ రెస్పాన్సబులిటీని గుర్తు చేసేలా ఉందని, ఈ షార్ట్ ఫిల్మ్ ఆలోచన ఎంతో అద్భుతమని అంటున్నారు.

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి సోషల్ రెస్పాన్సబులిటీ ఉన్న హీరోలుగా చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్నారు. ఇపుడు అల్లు అర్జున్ కూడా వారి అడుగు జాడల్లో నడుస్తూ సమాజం మంచి కోసం తన వంతు బాధ్యత నిర్వర్తిస్తుండటం చర్చనీయాంశం అయింది. అల్లు అర్జున్ సోషల్ రెస్పాన్సబులిటీకి సంబంధించిన వివిధ కార్యకలాపాలు ఇలానే కొనసాగిస్తే...భవిష్యత్తులో అతనికి పవన్ కళ్యాణ్ లాంటి గుర్తింపు దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/ZkbQcayOsc0" frameborder="0" allowfullscreen></iframe></center>
సెల్‌ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం, పరీక్షల్లో కాపీ కొట్టడం, చెత్తను రోడ్డుపై పడేయడం, సెలబ్రిటీలకు అసాధారణ సౌకర్యాలు కల్పించడం... ప్రస్తుతం సమాజంలో మామూలైపోయిన నిర్లక్ష్య ధోరణులివి. వీటిని నిలువరించడం అంటే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడమే. ఇదీ దేశసేవ కిందకే వస్తుందంటున్నారు అల్లు అర్జున్. ఈ షార్ట్ ఫిల్మ్ కు సుకుమార్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











