ఎవడైనా సరే మా అమ్మని అంటే ఊరుకునేది లేదు .. అల్లుఅర్జున్ కొడుకు సంచలనం..!
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి చిరు తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు సినీరంగంలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. అల్లు అరవింద్ కుమారుడిగా, దివంగత మహానటుడు అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు బన్నీ.
తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో స్టైలీష్ స్టార్‌గా యువతలో సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ తన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. నటన, డైలాగ్స్, ఫైట్స్‌తో పాటు ఈ జనరేషన్ తెలుగు హీరోల్లో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా మారారు. ఎంతటి క్లిష్టమైన మూవ్‌మెంట్స్ అయినా సరే అలవోకగా చేస్తూ మావయ్య చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టారు. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి విలక్షణ చిత్రాలలోనూ నటించి సత్తా చాటారు అల్లు అర్జున్. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ కెరీర్‌ను పుష్ప మలుపు తిప్పింది.

గంధపు చెక్కల స్మగ్లర్‌గా , డీ గ్లామర్ రోల్‌లో అల్లు అర్జున్ ఒదిగిపోయారు. డ్యాన్స్, ఫైట్స్, మేనరిజంతో బన్నీ దేశాన్ని ఊపేశారు. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై.. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డుల్లోకెక్కారు అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది.
ఇకపోతే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4కే గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేశారు. దీనిలో భాగంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చారు. ఇదే షోకి బన్నీ కొడుకు అయాన్, కుమార్తె అర్హలు కూడా వచ్చి సందడి చేశారు. పిల్లలిద్దరూ బాలయ్య కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. నీకు తెలుగు వచ్చా అని అర్హని అడగ్గా .. అటజని కాంచె అంటూ తెలుగు పద్యాన్ని అలవోకగా చెబుతుంది.
ఇక అల్లు అయాన్‌తో కుస్తి పట్టి ఆటపట్టిస్తాడు బాలకృష్ణ. అయాన్‌కి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టమని బన్నీ చెబుతాడు. యానిమల్ సినిమాలో వాళ్ల నాన్నని ఏమైనా అంటే హీరో చంపేసినట్లే .. మా ఇంట్లో రివర్స్ అని చెబుతాడు. నాన్న అంటే ఇష్టమే కానీ వాళ్ల అమ్మని ఏమైనా అంటే నాన్నని కూడా కొట్టేస్తాడని అయాన్ గురించి చెబుతాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











