Allu Ayaan : అల్లు అయాన్ బోల్తే.. సెల్ఫీ అడిగితే ఇలా షాక్ ఇచ్చాడు ఏంటి?
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్, పాపులారిటీ గ్లోబల్ వైడ్ గా పెరిగిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ముద్దుల కొడుకు తండ్రి రేంజులోనే పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు. అల్లు అయాన్ వీడియోలు నెట్టింట తరచూ వైరల్ గా మారుతుంటాయి. తాజాగా అల్లు అయాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అభిమానికి అల్లు అయాన్ తనదైన శైలిలో షాకిచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గల్లీ నుంచి దేశవిదేశాల్లో ఈ పేరు విపిస్తుంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే బన్నీ తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడనే విషయం తెలిసిందే. స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లాడిన బన్నీ.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. బన్నీ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.

బన్నీతో అర్హ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ కనిపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బన్నీ కొడుకు అయాన్ మాత్రం అంత స్టార్ డమ్ ను తెచ్చుకోలేకపోయినా.. అయాన్ వీడియోలు మాత్రం ట్రోల్ అవుతుంటాయి. కరోనా సమయంలో అందరు బయట చప్పట్లు కొడుతుంటే.. ఆ సౌండ్ కి అయాన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఎంత ట్రోల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఆ తర్వాత బన్నీకి నేషనల్ అవార్డు ప్రకటించిన రోజున మీడియా మొత్తం విషెష్ చెప్పడానకి బన్నీ ఇంటికి వెళ్లగా.. అక్కడ అల్లు అయాన్ ఇచ్చిన ఫోజు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంది. బన్నీకి అందరూ విషెస్ చెప్తుంటే పై పోర్షన్ లో అయాన్ గోడకు బల్లిలా అతుక్కొని కనిపించి నవ్వులు పూయించాడు. ఇదే కాదు... దసరా రోజున స్నేహ, అర్హ, అయాన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలపింది.
అందులో ఫ్లోరల్ కుర్తీ వేసుకొని అల్లు అయాన్ మోడల్ లా ఫోజిచ్చాడు. ఇక ఇప్పుడు అల్లు అయాన్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉండగా... ఇటీవల అల్లు అర్జున్ బెర్లిన్ వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ తో మాట్లాడారు. అందులో ఓ వ్యక్తి అల్లు అయాన్ అంటూ గట్టిగా అరవగా... వెంటనే బన్నీ స్పందిస్తూ మోడల్ బోల్తే అంటూ మోడల్ సింబల్ చూపించాడు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. అల్లు అయాన్ దగ్గరకు ఓ ఇద్దరు అమ్మాయి వచ్చి సెల్ఫీ అడిగితే నేను ఇవ్వనని చెప్పి తన పని చూసుకున్నాడు. దీంతో ఈ వీడియోపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. మోడల్ అయాన్ బోల్తే.. అట్లుంటది అయాన్ అంటే అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











