జూ...లో అల్లు అర్జున్ ముద్దుల తనయుడు (ఫోటోస్)
హైదరాబాద్: అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అయాన్‌కు సంబంధించిన ఫోటోలు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి ఈ ఫోటోలను షేర్ చేసారు. అల్లు అయాన్ ని జంతుప్రదర్శనశాల(జూ)కి తీసుకెళ్లినట్లు ఈ ఫోటోలు ఉన్నాయి.

సాధారణంగా సెలబ్రిటీ కొడుకు అంటే అభిమానులు, మీడియా వారు ఆసక్తి చూపడం మామూలే...అయాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. అభిమానులు, మీడియా ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ తన కొడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు.

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు.
More from Filmibeat
allu arjun sneha reddy tollywood ram charan teja pawan kalyan chiranjeevi అల్లు అర్జున్ స్నేహారెడ్డి టాలీవుడ్ రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి


Click it and Unblock the Notifications











