శభాష్ : ఇది అల్లు అర్జున్ కొడుకు రికార్డు

By Srikanya

హైదరాబాద్ : పుట్టి ఎంతో కాలం కాలేదు ..అప్పుడే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అల్లు వారసుడు. అల్లు అర్జున్ కుమారుడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అల్లు అర్జున్ కుమారుడు ఫొటో వైరల్ లా ముందుకు వెళ్తోంది. ఈ ఫొటోకి వచ్చినన్ని లైక్ లు, షేర్లు ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రెటి కుమారుడుకి రాలేదని అంటున్నారు. ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ ఫాలో వర్స్ ఈ ఫొటో పెట్టిన కొద్ది సేపట్లోనే.. దీన్ని 8.5 మిలియన్ లైక్ లతో ముంచెత్తారు. అంటే అప్పుడే ఈ బుడతడు రికార్డు క్రియేట్ చేసినట్లేగా.

అల్లు అర్జున్‌, స్నేహ దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. . ఆ బాబుకి అయాన్‌ అనే పేరు పెట్టారు. అయాన్ అంటే... దివ్యమైనది(సంస్కృతం), దేవుని బహుమతి(అరబిక్),గుర్తు పెట్టుకోవాల్సింది(పర్షియన్)భాషల్లో అర్దాలు ఉన్నాయి. ఏదైమైనా ఈ బాబు పుట్టగానే అల్లు అర్జున్ కి పెద్ద హిట్ సినిమా రేసుగుర్రం రావటం జరిగింది.

ప్రస్తుతం...

Allu Arjun Son creates Rare Record

అల్లు అర్జున్ .. త్వరలో గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి చేయటంతో అతని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం కథానాయకులలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది'' అంటూ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X