»   » చిరు 150 చిత్రం టైటిల్ నచ్చకేనా....అల్లు అర్జున్ ఇలా...

చిరు 150 చిత్రం టైటిల్ నచ్చకేనా....అల్లు అర్జున్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150 వ చిత్రం గురించి బయిట అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ...అంతకన్నా ఎక్కువగా మెగా ఫ్యామిలీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఆటో జాని టైటిల్ ...నచ్చినట్లు లేదు అల్లు అర్జున్ కు..టైటిల్ సజెషన్స్ ఇవ్వమని ఫ్యాన్స్ ని అడుగుతూ ట్వీట్ చేసారు.

అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.... "చిరంజీవి గారి 150 వ సినిమా... ! కింగ్ ఈజ్ బ్యాక్ ! వ్యక్తిగతంగా నేను చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను... ట్విటర్స్ ...ఏమన్నా టైటిల్ గురించి సజెషన్స్ ఇవ్వండి... ?," అంటూ ట్వీట్ చేసారు. దాంతో మెగాభిమానులు రకరకాల టైటిల్స్, ఆలోచనలతో ఈ ట్వీట్ కు సమాధానం ఇవ్వటానికి సిద్దపడుతున్నారు. ఆలస్యం ఎందుకు మరి మీరు కూడా ఏమన్నా టైటిల్ ఐడియాలు ఇవ్వవొచ్చు...ఏమంటారు.

Allu Arjun speaks out on Chiru's 150th Film

ఇక రామ్ చరణ్‌ తొలి చిత్రం ‘చిరుత'కు దర్శకుడు జగన్నాథే కావడం గమనించదగ్గ అంశం. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్‌ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు. ‘‘ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్‌ దగ్గర డెకరేషన్లు చేసేవాడికి ఏం తెలుసు, ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ సినిమా డైరెక్ట్‌ చేస్తాడని. ప్లీజ్‌ అతణ్ణి ఆశీర్వదించండి'' అని ట్వీట్‌ చేశారు.

ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్‌ రవి ‘‘మెగాస్టార్‌ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్‌ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం. చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్నారు.

English summary
A short while ago, Allu Arjun took to his micro-blogging page to express his happiness over the developments in the recent past. "Chiranjeevi Garu's 150TH Movie ! The KING Is BACK ! Personally was waiting for this from a longgg time. Any Title suggestions Tweeters ?," he tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu