twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేరళ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్‌కు ఆహ్వానం, ఎందుకో తెలుసా?

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్‌కు టాలీవుడ్‌తో పాటు కేరళ రాష్ట్రంలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ సినిమా విడుదలైందంటే... తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ సందడి వాతావరణం ఉంటుంది. బన్నీ నటించిన చిత్రాలు మలయాళం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి.

    బన్నీకి కేరళలో ఉన్న ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకుని త్వరలో అక్కడ జరుగబోయే పడవ పోటీలకు ఆహ్వానిస్తూ కేరళ ప్రభుత్వంనుంచి ఇన్విటేషన్ అందింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్న స్టైలిష్ స్టార్... మిస్సవ్వకుండా ఆ వేడుకకు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

     65 ఏళ్ల నుంచి జరుగుతున్న రేస్

    65 ఏళ్ల నుంచి జరుగుతున్న రేస్

    నేహ్రు ట్రోఫీ బోట్ రేసుపేరుతో జరిగే.... ఈ పడవల పోటీ కేరళలో ప్రతి ఏడాది ఓ స్పెషల్ ఎట్రాక్షన్. దాదాపు 65 ఏళ్ల నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. నవంబర్ 10న 66వ బోట్ రేస్ జరుగబోతోంది.

    బన్నీ వస్తే ఆ సందడే వేరు..

    బన్నీ వస్తే ఆ సందడే వేరు..

    ఈ బోటు రేసుకు బన్నీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని తెలుస్తోంది. అలప్పిలోని పున్నమాడ లేక్‌లో జరిగే ఈ పోటీలో మొత్తం 81 బోట్లు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.

    కేరళకు బన్నీ సహాయం

    కేరళకు బన్నీ సహాయం

    ఇటీవల కేరళలో భారీ వరదలు వచ్చినపుడు అల్లు అర్జున్ తనవంతు సహాయంగా రూ. 25 లక్షలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సహాయం బన్నీపై అభిమానుల్లో గౌరవం మరింత పెంచింది.

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.... ‘నా పేరు సూర్య' తర్వాత అఫీషియల్‌గా ఏ సినిమాకు కమిట్ కాలేదు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Allu Arjun received an invitation from the Kerala Government seeking his presence for an official event 66th Nehru Trophy Boat Race.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X