twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు హీరోలు ఈ మధ్యన ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. వారి పేరిట కొన్ని ఫ్యాన్ పేజీలు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక తెలుగునాటే కాకుండా.... కర్నాటక, కేరళల్లోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.

    అల్లు అర్జున్ తాజాగా ఫేస్ బుక్‌లో అర మిలియన్(5 లక్షలు)ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. దాంతో ఆయన తన ఫ్యాన్స్ ను సంతోష పరచటానికి స్పెషల్ ఫోటో షూట్ తో ఫేస్ బుక్ లోకి వచ్చారు. అక్కడ ఓ అందమైన తన ఫోటో స్టిల్స్ తో అదరకొట్టారు. ఇప్పుడా ఫోటోలు ఫేస్ బుక్ లో హాట్ కేకుల్లా మారాయి. ఆ ఫోటోలు మీకోసం...

    ప్రస్తుతం అల్లు అర్జున్....'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలవ్వబతోంది. ఈ సినిమా కోసం ఫిల్మ్ రీల్‌ అవసరం లేని అత్యాధునికమైన 'ఆర్రి అలెక్నా కెమెరా సిస్టమ్స్' కొనుగోలు చేసారు. ఈ కెమెరాల ద్వారా హై క్వాలిటీ ఔట్ పుట్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని 'లైఫ్ ఆఫ్ పై', స్కైఫాల్, అవెంజర్స్ లాంటి చిత్రాల్లో వాడారు. తెలుగులో తొలిసారిగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి వాడుతున్నారు.

    హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    అల్లు అర్జున్ ఇటీవల నటించిన ‘జులాయి' చిత్రం మంచి విజయం సాధించడం కూడా ఫేస్ బుక్ లో ఇంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవడానికి మరో కారణం.

    హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    ఈ రోజు జన జీవితంలో ఫేస్ బుక్, ట్విట్టర్ ఓ భాగం అయిపోయాయి. ఈ నేఫధ్యంలో అక్కడ పోటీ కూడా ఎక్కువే. మరి అలాంటి చోట...నెంబర్ వన్ ప్లేసుకు రావటం అంటే మాటలు కాదు అంటున్నారు ఫ్యాన్స్ .

    హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    అల్లు అర్జున్ కి మొదటి చిత్రం నుంచి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందులోనూ అల్లు అర్జున్ తన చిత్రాల్లో ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటాడు. అదే అతనికి ప్లస్ అయ్యింది.

    హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్కువగా ఉండేది యూత్. వారికి తన స్టైలిష్ లుక్ తో తనదైన నటనతో, యూత్ ని రిప్రెరెంజ్ చేసే ఆర్య వంటి చిత్రాలతో బన్నీ దగ్గరయ్యాడు.

     హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    ప్రస్తుతం అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    హాట్ టాపిక్ : అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో షూట్( ఫొటోలు)

    అల్లు అర్జున్ స్పందిస్తూ...నెంబర్ వన్ సోషల్ నెట్వర్కింగ్ ఫేస్ బుక్ లో నాకు అర మిలియన్(5 లక్షలు)మంది ఫాలోవర్స్ రావడం, ఈ విషయంలో తెలుగు హీరోల్లో టాప్ లో నిలవడం ఆనందంగా ఉంది, నన్ను అభిమానులు ఎప్పుడూ ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.

    English summary
    
 Allu Arjun has crossed the milestone of 5, 00,000+ fans on his Facebook fan page and this is the highest number of followers for any Tollywood hero on FB. On the occasion of crossing the landmark, Allu Arjun did a small photo shoot where he posed for his fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X