గిఫ్ట్‌లు, పార్టీలు లేకున్నా ఎంతో ఆత్రుతగా ఉంది.. అల్లు శిరీష్‌కు అన్నావదినల స్పెషల్ విషెస్
అల్లు శిరీష్ లాక్ డౌన్‌లో ఎన్నికష్టాలు పడుతున్నాడో అందరికీ తెలిసిందే. క్వారంటైన్‌లోని బాధలను వీడియో రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ మేరకు అల్లు వారబ్బాయి పెట్టిన వీడియోలన్నీ తెగ వైరల్ అయ్యాయి. వండుకోవడం, తినడం, ఆడుకోవడం, టీవ చూడటం, ఫోన్ వాడటం, పడుకోవడం వంటి పనులతో విసిగిపోయానని చెప్పుకొచ్చాడు. ఆడుకోవడానికి కూడా ఏ ఒక్కరూ లేరని ఒంటరిగానే ఆడుకుంటున్నాని తెలిపాడు. నేడు అల్లు శిరీష్ బర్త్. ఈ సందర్భంగా అన్నా వదినలైన బన్నీ, స్నేహారెడ్డిలు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.

బర్త్ డేపై సెటైర్స్..
అల్లు శిరీష్ తన బర్త్ డేపై గతంలోనే సెటైర్స్ వేసుకున్నాడు. నాల్గో దశ లాక్ డౌన్‌ను విధించినప్పుడు మే 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అయితే తన బర్త్ డేను ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుతారని, అందరూ సంబరాలు చేసుకుంటారని, లాక్ డౌన్ ముగుస్తుందని తనకు గిఫ్ట్‌లు ఏమీ ఇవ్వకండని అల్లు శిరీష్ సెటైర్స్ వేశాడు.

ఎంతో ఆత్రుతగా ఉంది..
అల్లు శిరీష్ తన పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘నో గిఫ్ట్స్, నో పార్టీ అయినా కూడా రేపటి నా బర్త్ గురించి ఎంతో ఆత్రుతగా ఉంది. లాక్ డౌన్ అయిపోతుందా? లేదా మళ్లీ పొడిగిస్తారా? అని తెలుసుకోవాలని ఉంది.. నా వాళ్లని త్వరగా కలుసుకోవాలి'అని నిన్న పోస్ట్ చేశాడు.

అన్నావదినల విషెస్..
అల్లు శిరీష్‌కు అన్న బన్నీ, వదిన స్నేహారెడ్డిల నుంచి విషెస్ వచ్చాయి. అల్లు శిరీష్ బర్త్ డే కామన్ డీపీని తమన్ చేత రిలీజ్ చేయించగా అది కాస్తా వైరల్ అయింది. అయితే అల్లు శిరీష్ దూరంగా ఉండటంతో ఎలాంటి ఈవెంట్స్ చేయలేకపోతున్నారు. దీంతో స్నేహా రెడ్డి.. హ్యాపీ క్వారంటైన్ బర్త్ డే శిరీష్ అని ఓ బోర్డ్‌పై రాసి విషెస్ చెప్పింది. అయితే ఇది అర్హ, అయాన్‌ల పని అయి ఉంటుందని ఆ రాతలు, ఆ బొమ్మలను పట్టి తెలుస్తోంది.

ఎప్పటికీ నా ఫేవరేట్ బేబీ..
ఇక సోదరుడు బర్త్ డే సందర్భంగా బన్నీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఇలాంటి సంతోషకరమైన రోజులెన్నో రావాలి సిరి..ఈ ప్రపంచంలో నువ్వే ఎప్పటికీ నా ఫేవరేట్ బేబీ'అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











