పక్కనే చేరి బన్నీ గుండెల్లోకి తూటా దించింది.. మామూలు పిల్ల కాదుగా.. అల్లు అర్జున్ కూడా తగ్గలేదు!

Recommended Video

Allu Arjun Speech At Priya Prakash Varrier's Lovers Day Movie Audio Launch | Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సినిమా ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా హాజరవుతూ అభిమానులని ఉత్సాహపరుస్తున్నాడు. కన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించిన ప్రియ వారియర్ ఒరు ఆధార్ లవ్ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు బన్నీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

బన్నీ గుండెల్లోకి తూటా

బన్నీ గుండెల్లోకి తూటా

అల్లు అర్జున్ ఆడియో వేడుక కోసం రాగానే ఈవెంట్ నిర్వాహకులు ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ప్రియా వారియర్ గన్ షాట్ మ్యూజిక్ ప్లే చేశారు. ఆ సమయంలో బన్నీ పక్కనే కూర్చుని ఉన్నా ప్రియా వారియర్ నేరుగా బన్నీకి గురిపెట్టి గన్ షాట్ పేల్చింది. ఈ దృశ్యం అక్కడున్న అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కన్నుగీటిన వీడియో, గన్ షాట్ వీడియో యూట్యూబ్ లో ఎలా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే.

కొలవెరి మొదలుకుని

కొలవెరి మొదలుకుని

ఆడియో వేడుకలో అల్లు అర్జున్ తన ప్రసంగంతో అలరించారు. బన్నీ మాట్లాడుతూ.. కొలవెరి సాంగ్ మొదలుకొని, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ప్రియా వారియర్ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ విషయాలు చాలా రోజులపాటు ట్రెండింగ్ లో నిలిచాయని బన్నీ తెలిపాడు.

మలయాళం నన్ను ఆదరిస్తోంది

మలయాళం నన్ను ఆదరిస్తోంది

సాధారణంగా నాకు సౌత్ ఇండియా అంటే పిచ్చి. నేను పుట్టింది చెన్నైలో, పెరిగింది హైదరాబాద్ లో. అలాగే నా చిత్రాల్ని మలయాళీ అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నా సినిమాలని వాళ్ళ సొంత సినిమాగా భావిస్తున్నారు. కన్నడ అభిమానులు కూడా నా చిత్రాలని ఇష్టపడుతున్నారు. అందుకే నాకు సౌత్ ఇండియా అంటే పిచ్చి అని బన్నీ తెలిపాడు. మలయాళం నుంచి తెలుగులోకి ఒరు ఆధార్ లవ్ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రానికి నా సహకారం అందించాలని ఈ వేడుకకు వచ్చినట్లు బన్నీ తెలిపాడు.

అందులో గొప్పేమీ లేదు

అందులో గొప్పేమీ లేదు

ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ వైరల్ వీడియోల వలనే ఈ చిత్రానికి ఇంత బజ్ ఏర్పడిందని బన్నీ తెలిపాడు. పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసి మార్కెట్ చేయడం గొప్పేమి కాదు. అంతా కొత్తవాళ్లతో సినిమా చేసి ఈ స్థాయిలో బిజినెస్ చేయడం నిజంగా గొప్ప విషయం అని బన్నీ తెలిపాడు. ఆ విషయంలో ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులుని బన్నీ అభినందించాడు.

నా పేరు సూర్య ఫెయిల్ అయిన తర్వాత

నా పేరు సూర్య ఫెయిల్ అయిన తర్వాత

నా పేరు సూర్య చిత్ర సమయంలో బన్నీ వాసు నాకు వినోద్ రెడ్డిని పరిచయం చేశారు. ఈయన మీ అభిమాని అని చెప్పాడు. నా సినిమాని కొంటున్నాడు కాబట్టి అలా చెబుతున్నాడేమో అనుకున్నా. నా పేరు సూర్య విడుదలై ఫెయిల్ అయింది. ఆ సమయంలో కొన్ని గొడవలు జరిగాయి. ఆ సందర్భంలో కూడా వినోద్ రెడ్డి నా అభిమానిగానే ఉన్నారని, ఆయనలో ఎలాంటి మార్పు లేదని బన్నీ వాసు చెప్పాడు. అప్పటి నుంచే వినోద్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నా. ఆయన కోసం ఏమైనా చేయాలనీ అనుకున్నా. అందుకే ఈ ఆడియో వేడుకుకు పిలవగానే వచ్చానని బన్నీ తెలిపాడు.

ఫ్యాన్స్‌పైకి తూటా

ఫ్యాన్స్‌పైకి తూటా

లవర్స్ డే చితం ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని బన్నీ కోరాడు. నాకు 14 ఏళ్ల వయసున్నప్పుడు లవర్స్ డే గురించి తెలిసింది. అప్పటి నుంచి నా బర్త్ డే కంటే గ్రాండ్ గా లవర్స్ డేని సెలెబ్రేట్ చేసుకుంటా అని బన్నీ తెలిపాడు. బన్నీ రాగానే ప్రియవారియర్ అతడిపై గన్ షాట్ పేల్చింది. బన్నీ కూడా తగ్గలేదు. చివర్లో వెళుతూ.. అభిమానులపై తూటా పేల్చి అలరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X