నా మీద నాకే సిగ్గు వేసింది.. ఆ మెచ్యురిటీ లేదు: అల్లు అర్జున్ ఎమోషనల్
హీరో కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వస్తున్న చావు కబురు చల్లగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ మాట్లాడుతూ....

బన్నీవాసుతో నా అనుబంధం
చావు కబురు చల్లగా సినిమా ఎలా ప్రారంభం కావడం వెనుక ఓ పిట్ట కథ ఉంది. ఈ సినిమాకు ప్రధాన కారణం బన్నీ వాసు. బన్నీ వాసుతో నా ప్రయాణం గంగోత్రి నుంచి ప్రారంభమైంది. నాకు అండగా ఎంతగానో నిలిచారు అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

నా తండ్రి కంటే బన్నీవాసు ఎక్కువ
నా సినిమాల సక్సెస్ వెనుక నా తండ్రి అల్లు అరవింద్ కంటే బన్నీ వాసు పాత్రనే ఎక్కువ పాత్రే ఉందని చెప్పగలను. నా మీద ఆయనకు ఎంత ప్రేమ ఉంటే తప్ప బన్నీ వాసు అని పేరు పెట్టుకోంటాడు చెప్పండి అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

నవదీప్ మాకోసం కథను త్యాగం..
నాకు ఇష్టమైన వాసు వచ్చి నేను ఒక కథ విన్నానని చెప్పారు. వాసుకు సాధారణంగా సినిమా అంత ఈజీగా నచ్చదు. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌తో తీయలేదు. అదే నాకు కొంత టెన్షన్‌గా ఉందని చెప్పారు. అయితే ఈ కథను నా బావ నవదీప్ చెప్పారు. తాను తీసుకొంటానని చెప్పాడు. కానీ మేము అడగగానే నవదీప్ కథను ఇచ్చేశాడు. అందుకు చాలా హ్యాపీగా ఉంది అని అల్లు అర్జున్ అన్నారు.

కౌశిక్ దర్శకత్వం సూపర్బ్
సినిమా కథ విన్న తర్వాత ఈ రోజు (మార్చి 9వ తేదీన) సినిమా చూశాను. సినిమా బాగా ఉంది. మన సినిమా గురించి మనం చెప్పుకోలేం. ఈ సినిమా గురించి చెప్పే ముందు డైరెక్టర్ కౌశిక్ గురించి చెప్పుకోవాలి. 26 ఏళ్లలో ఇంత ఫిలాసఫీ ఉందా? ఆ వయసులో నాకు అంత మెచ్యురిటీ లేదు. కౌశిక్‌ను చూస్తే నాకే సిగ్గేసింది. అందరికి హిట్ ఇచ్చేది డైరెక్టరే అంటూ అల్లు అర్జున్ అన్నారు.

బస్తీ బాలరాజు గుండెల్లో గుచ్చుకొంటారు
ఇక చావు కబురు చల్లగా సినిమాలోని బస్తీ బాలరాజు గురించి చెప్పాలి. ఆ పాత్రను కార్తీకేయ అద్బుతంగా చేశాడు. బస్తీ బాలరాజు మీ గుండెల్లోకి వచ్చి గుచ్చుకొంటాడు. 26 ఏళ్ల వయసులో గొప్పగా నటించాడు. ఆర్ఎక్స్ 100 సినిమా చూశాను. ఇక ఈ సినిమాలో మరింతగా నచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా నిజాయితీగా మాట్లాడి మరింత నాకు దగ్గరయ్యారు అని కార్తీకేయ గురించి అల్లు అర్జున్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











