ఆగ్నేయాసియా దేశాల వైపూ మనం దృష్టిపెట్టాలి: అల్లు అర్జున్
తెలుగు సినిమా మార్కెట్ విషయంలో మనం ముందుకు వెళ్లాలి. పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాలు, అమెరికా... ఇలా లెక్కలు వేసుకొంటూ పరిమితమైపోకూడదు. ఆగ్నేయాసియా దేశాల వైపూ మనం దృష్టిపెట్టాలి. ఇప్పటికే తమిళ చిత్రాలు ఆ దేశాల్లో విడుదలవుతున్నాయి. సినిమా స్కూళ్ల ద్వారా మంచి లైన్ ప్రొడ్యూసర్లనీ మనం తయారు చేసుకోవచ్చు. ఫలితంగా చిత్ర నిర్మాణం, వ్యాపారంలో మంచి మార్పులొస్తాయ న్నాయి అన్నారు అల్లు అర్జున్. హైదరాబాద్ లో బుధవారం 'ఫిక్కీ ఫ్రేమ్స్ 2010' సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో భాగంగా - వినోద పరిశ్రమలో యువతరం అనే అంశమ్మీద చర్చ నిర్వహించారు. తెలుగు హీరోలు సుమంత్, అల్లు అర్జున్, మంచు విష్ణు, తాప్సి పాల్గొని మాట్లాడారు. ఈ చర్చకి సంధానకర్తగా వ్యవహరించిన లక్ష్మీ మంచు మాట్లాడుతూ...ప్రాంతీయ భాష అంటూ ఒక రాష్ట్రానికే సినిమాని పరిమితం చేసుకోకూడదు. హద్దులు చెరుపుకొని మార్కెట్ పెంచుకొంటేనే మంచి చిత్రాలొస్తాయని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











