అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ప్రెవేట్ ట్రిప్ నిమిత్తం యూరప్ కంట్రీస్ కి వెళ్ళిన సంగతి తెలిసింది.ఆ టూర్ ముగించుకున్న బన్ని ఇప్పుడు రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ' షూటింగ్ జరుగుతున్న శ్రీలంక చేరుకున్నాడు.అక్కడ కొద్ది రోజులు గడిపి త్వరలోనే హైదరాబాద్ కి రానున్నాడు.అల్లు అర్జున్ తో ఉన్న స్నేహా రెడ్డికి షూటింగ్ లు కొత్త కావటంతో బాగా ఎంజాయ్ చేస్తోందన చెప్తున్నారు.ఇక రామ్ చరణ్ కూడా కొద్ది రోజులనుంచి శ్రీలంకలో ఉండటంతో బన్నీని చూసి హోమ్ సిక్ ఫీలింగ్ పోయిందని తెలుస్తోంది.ఇక బన్నీ హైదరాబాద్ వచ్చిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.హీరోయిన్ సమంత గా నిర్ణయమైన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.గతంలో దానయ్య ..అల్లు అర్జున్ హీరోగా దేశముదురు చిత్రం నిర్మించారు.ఇక రచ్చ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.సంపత్ నంది దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.