HBD Allu Arjun: మాస్ జాతర అంటే ఇదే.. రికార్డుల తాట తీసేలా పుష్ప 2 టీజర్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో భారీ సినిమాలు రూపొందుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా హైప్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి. అలాంటి సినిమాల్లో 'పుష్ప ది రూల్' మూవీ ఒకటి. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప ది రైజ్'కు ఈ సినిమా సీక్వెల్‌గా రాబోతున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప ది రూల్' మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇలా చాలా రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో చాలా టాకీ పార్టును పూర్తి చేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియో కూడా విడుదలైన విషయం తెలిసిందే. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి హై ఓల్టేజ్ యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.

తాజాగా విడుదలైన 'పుష్ప ది రూల్' టీజర్ వీడియోలో జాతర ఎపిసోడ్‌నే హైలైట్ చేసి చూపించారు. ఇందులో అల్లు అర్జున్ చీర కట్టుకుని అమ్మవారి గెటప్‌తో దర్శనమిచ్చాడు. అంతేకాదు, అతడిని చూపించిన తీరు, కనబర్చిన మేనరిజం హైలైట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో వచ్చే స్పెషల్ ఫైట్ స్టైల్ బన్నీ అభిమానులనే కాదు.. సినీ ప్రియులనూ ఆకట్టుకునే విధంగా ఉంది.

Allu Arjun Starrer Pushpa The Rule Movie Teaser Released

'పుష్ప ది రూల్' టీజర్‌లో విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అలాగే, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. మొత్తంగా ఈ టీజర్ అంచనాలను అందుకోవడంతో పాటు రికార్డుల తాట తీసేలా డిజైన్ చేసినట్లు ఉంది. దీంతో 'పుష్ప ది రూల్' టీజర్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇది క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X