‘బిజినెస్’ కి పక్కా ప్లాన్ తో అల్లు అర్జున్...!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కో స్టార్స్ అయిన మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ మరియు నాగార్జున్ వంటి బిజినెస్ మ్యాన్ ల లిస్ట్ లోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు తాను వ్యాపారంలోనూ దేశముదురేనని నిరూపించుకునే పనిలో పడ్డట్లుంది. హైదరాబాద్ సమీపంలోని తెల్లాపూర్‌లో రూ.5కోట్లకు 1 ఎకరం కొన్నాడు. అక్కడ అధునాతన విల్లాను నిర్మించారు.
దీనిని పూర్తిగా వ్యాపార వ్యవహారాలకోసం వాడుకునే ఆలోచనలో ఉన్నారు. అక్కడే ఓ రిసార్ట్ నిర్మించాలని, దానిని అధునాతన వసతులతో నిర్మించి సినిమా స్టోరీ డిస్కషన్ లకు అద్దెకివ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరాకు తోడు పక్కనే ఉన్న కొంత భూమిని సేకరించే పనిలో పడ్డారు. పూర్తిగా అధునాతన భవనాలు నిర్మించి రోజుకు రూ.లక్ష రూపాయల అద్దెకు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. సో మరో హీరో బిజినెస్ మెన్ గా మారిపోయాడన్న మాట. ఇటు సినిమాలు అటు వ్యాపారం బాప్ ఏక్ నంబరీ బేటా దస్ నంబరీ అంటే ఇదే నేమో.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వినోదాత్మకంగా సాగే ఓ యాక్షన్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మొన్నామద్యన హైదరాబాద్‌లో మొదలైన విషయం విధితమే. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











