బన్నీ లుక్ బయటకు వచ్చేసింది: నా పేరుసూర్య కోసమే ఈ కొత్త లుక్
అక్కినేని వారి రిసెప్షన్ లో చైతు-సామ్ లే మెయిన్ అట్రాక్షన్ అయినా, బన్నీ లుక్స్ గురించి హాట్ డిస్కషన్స్ మొదలైపోయాయి. నా పేరు సూర్య సినిమా కోసమే.. బన్నీ ఇలా ప్రిపేర్ అయ్యాడనే సంగతి తెలిసిపోతోంది.
Recommended Video

స్తైలిష్ స్టార్... ఈ ట్యాగ్ లైన్ ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉంటాడు అల్లు అర్జున్, ప్రతీ సినిమాకీ బన్నీ స్టైల్ లో కొత్త మార్పు కనిపిస్తూ ఉంటుంది ఆర్య 2 నుంచీ ప్రతీ కొత్త ప్రాజెక్ట్ లోనూ స్టైల్ లో తనదైన కొత్త మార్క్ చూపిస్తూ వస్తున్నాడు ఈ అల్లు హీరో. డీజే తో కాస్త డల్ అయినా మళ్ళీ తన పాత జోష్‌తో నా పేరు సూర్య సెట్స్ మీదకి వచ్చాడు. ఈ సినిమా కోసమే కొత్త లుక్ లోకి మారిపోయాడు బన్నీ, సమంతా-నాగ చైతన్య రెసెప్షన్ లో సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు.

నా పేరు సూర్య
సహజంగా కేరక్టర్ ఏదైనా.. తమ స్టైలింగ్ నే కంటిన్యూ చేయడం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు కేరక్టర్ కు తగినట్లుగా మారిపోతున్నారు స్టార్ హీరోలు. నా పేరు సూర్య చిత్రంలో ఆర్మీ మనిషిగా కనిపించనున్న బన్నీ.. ఇప్పుడు అదే లుక్ ను చూపించేయబోతున్నాడు.

చిన్న లీక్ కూడా బయటకు రాలేదు
ఇప్పుడు నా పేరు సూర్య అంటూ రైటర్ వక్కంతం వంశీతో కొత్త సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ షూటింగ్ మొదలయ్యి.. కొన్ని నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ మూవీకి సంబంధించిన చిన్న లీక్ కూడా బయటకు రాలేదు.

నాగచైతన్య-సమంతల రిసెప్షన్
రిలీజ్ కి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. అప్పుడే ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్ట్ చేయడం కూడా సాధ్యం కాదు. అయితే.. ఇప్పుడు నాగచైతన్య-సమంతల రిసెప్షన్ కారణంగా.. తన తర్వాత చిత్రంలో అల్లు అర్జున్ లుక్ ఏంటో జనాలకు తెలిసిపోయింది.

నా పేరు సూర్య సినిమా కోసమే
ఈ రిసెప్షన్ లో చైతు-సామ్ లే మెయిన్ అట్రాక్షన్ అయినా.. బన్నీ లుక్స్ గురించి హాట్ డిస్కషన్స్ మొదలైపోయాయి. కనిపించీ కనిపించకుండా ఉన్న గెడ్డం.. మిలిటరీ హెయిర్ కట్ చూస్తే.. నా పేరు సూర్య సినిమా కోసమే.. బన్నీ ఇలా ప్రిపేర్ అయ్యాడనే సంగతి తెలిసిపోతోంది.


Click it and Unblock the Notifications











