అల్లు అర్జున్-సుకుమార్ షార్ట్ ఫిల్మ్ (ఫోటోస్)
హైదరాబాద్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటికే ఆర్య, ఆర్య-2 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ షార్ట్ ఫిల్మ్ రాబోతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సందేశాత్మకంగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోంది. 'ఐయామ్ దట్ చేంజ్' పేరుతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ స్వయంగా నటిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ ను నిర్మిస్తున్నారు.
మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ దారిలోనే ప్రయాణిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో సమాజానికి తన వంతు సేవ చేసారు. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సందేశాత్మకంగా షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అమూల్ రాథోర్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇటీవలే ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తాజాగా అందుకు సంబందించిన ఫోటోలు విడుదల చేసారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల చేయనున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు...

అల్లు అర్జున్, సుకుమార్
షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో అల్లు అర్జున్, సుకుమార్

బన్నీ, సుక్కు సాన్నిహిత్యం
అల్లు అర్జున్, సుకుమార్ చాలా సన్నిహితంగా ఉంటారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య' సినిమా బన్నీ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.

చిత్రీకరణ
షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో అల్లు అర్జున్ ఇలా....

ప్రివ్యూ..
షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ అనంతరం వీడియో ప్రివ్యూ చూస్తున్న అల్లు అర్జున్, సుకుమార్


Click it and Unblock the Notifications











