Pushpa 2: కిక్కురా చారీ.. హిందీలో కూడా మన డామినేషనే.. పుష్ప భాయ్ కోసం అంతా వెయింటిగ్!
ఆర్మాక్స్ మీడియా సంస్థ సినీ ప్రముఖులపై, సినిమాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా హిందీలో మోస్ట్ అవైటెట్ సినిమాల జాబితాను విడుదల చేసింది. 2024 సంవత్సరంలో బాలీవుడ్ అంతా ఏ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు అనే దానిపై సర్వే నిర్వహించింది. ఇక ఆ సర్వేలో మన తెలుగు బెస్డ్ పాన్ ఇండియా చిత్రం నిలవడం విశేషం. దీంతో ఇదే కదా తెలుగు రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆర్మాక్స్ రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ చిత్రాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇప్పుడు దేశం అంతా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇప్పటికే 2021లో పుష్ప సినిమా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిచింది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు.

అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ ఏడాది ఆగస్టు 14న పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కాబోతుంది పుష్ప 2. ఇప్పుడు దేశం మొత్తం ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారని ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగు అభిమానులు... కిక్కురా చారీ... హిందీలో కూడా మన డామినేషనే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ లిస్టులో మరో నాలుగు చిత్రాలు కూడా నిలిచాయి.

ఆ తర్వాతి రెండో స్థానంలో హేరా ఫేరి 3 సినిమా నిలువగా.. ఆ తర్వాతి 3వ స్థానంలో వార్ 2 నిలిచింది. ఇక ఈ చిత్రంలో కూడా మన తెలుగు హీరో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాతి స్థానంలో భూల్ భూలయ్య 3 చిత్రం నిలిచింది. ఇక ఈ సిరీసులో వచ్చిన రెండు చిత్రాలు హిట్ అవ్వగా ఇప్పుడు మూడో చిత్రం రాబోతుంది.
ఇక చివరి ఐదో స్థానంలో సింగం అగైన్ నిలిచింది. తమిళంలో సూర్య సింగం సిరీస్ ను హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీరిసులో వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మరో చిత్రం రాబోతుంది. ఇవండీ మోస్ట్ అవైటెట్ హిందీ చిత్రాలు. ఇక వీటిలో మన తెలుగు బేస్డ్ పాన్ ఇండియా చిత్రం ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











