Pushpa సాంగ్ మేకింగ్ వీడియో లీక్.. సుకుమార్ కష్టం వృథా!

సుకుమార్ అల్లు అర్జున్ దేవీ శ్రీ ప్రసాద్ త్రయం కలిస్తే సినిమా ఎలా ఉంటుంది.. ఆడియో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్య, ఆర్య 2లు ఆడియో పరంగా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పైగా సుకుమార్ అంటే దేవీ శ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడు. ఎవరికి ఎలా కొట్టినా కూడా సుకుమార్‌కు ఇరగ్గొట్టేస్తాడు. అదే దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేకత. దానికి నిదర్శనంగా నిలిచేలా ఓ శాంపిల్ బయటకు లీక్ అయింది.

 పుష్ప షూటింగ్..

పుష్ప షూటింగ్..

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ కూడా పుష్ప సినిమా షూటింగ్ కోసం కుస్తీలు పడుతున్నారు. త్వరగా సినిమాను పూర్తి చేసేయాలనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఆగస్ట్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఈమేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

 విడుదల తేదీపై క్లారిటీ..

విడుదల తేదీపై క్లారిటీ..

పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలని చిత్ర యూనిట్ భావించింది. లాక్డౌన్ కారణంగా అసలే సినిమా చాలా ఆలస్యమైంది. లాక్డౌన్ కాలంలోనే దేవీ శ్రీ ప్రసాద్ ఆడియోను కూడా పూర్తి చేసినట్టు టాక్ వచ్చింది. పుష్ప కోసం అదిరిపోయే ట్యూన్లు వచ్చాయని ఆ మధ్య చెప్పాడు.

 తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

అయితే ఇప్పుడు పుష్ప యూనిట్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగర్లందరూ యమా జోరులో పార్టీ చేసుకుంటున్నట్టుగా ఈ పాట కొనసాగేలా కనిపిస్తోంది. ఈ మేరకు బయటకు వచ్చిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

 మ్యూజిక్ మాత్రం..

మ్యూజిక్ మాత్రం..

అయితే మ్యూజిక్ వస్తుండగా.. అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.. రెండు మూడు సార్లు రీటేక్‌లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే లిరిక్స్ అంతగా బయటకు రాకపోయినా బీట్ మాత్రం బయటకు వచ్చింది. దీంతో బన్నీ, డీఎస్పీ అభిమానులు దుమ్ములేపుతున్నారు.

Recommended Video

Pushpa : అటవీ ప్రాంతం లో షూటింగ్.. షూటింగ్ స్పాట్ లో విషాదం.. | Allu Arjun
లీక్ అయితే అయింది గానీ..

లీక్ అయితే అయింది గానీ..

లీక్ అయితే అయింది గానీ బీట్ మాత్రం అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి బన్నీ, సుక్కులకు ఎలా కొడతాడో మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ నిరూపించాడంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంత కష్టపడి షూటింగ్ చేస్తోన్న సుకుమార్ కష్టం వృథా అయ్యేలానే కనిపిస్తోంది. కానీ చివరకు ఇదంతా మంచే జరిగేలా ఉంది. ఈ చిన్న బిట్ బయటకు రావడంతో జనాల్లో ఇంత క్రేజ్ పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X